జూలై 13, 2014

మీలో ఎవరు కోటీశ్వరుడు

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 8:28 సా. by వసుంధర

యునైటెడ్ కింగ్‍డమ్‍లో టివిలో వచ్చిన  Who Wants to Be a Millionaire?   కార్యక్రమం ఆధారంగా రూపొందించిన హిందీ టివి కార్యక్రమం  కౌన్ బనేగా కరోర్ పతి. అది ఆంగ్ల కార్యక్రమానికి పూర్తి అనుకరణ అయినా- సూత్రధారుడు అమితాబ్  బచ్చన్ దానికి అద్దిన సొగసులు మరపురానివి. ఆయన గొంతు, హుందాతనం, నిర్వహించిన తీరు- ఆ కార్యక్రమాన్ని సూపర్‍హిట్ చేశాయి.  ఇప్పుడా కార్యక్రమాన్ని మాటివి వారు కొద్ది వారాలక్రితం ఆరంభించారు. నిర్వహించేది నాగార్జున అని తెలిసినప్పుడు- నాగార్జున ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ తరహా విలువ, హుందాతనం తీసుకురాగలరా అన్న సందేహం మాకు కలిగింది. అతడు తన మాట, నవ్వు, తీరులలో అమితాబ్‍నే అనుసరించినట్లు అనిపించింది తొలి కార్యక్రమంలో. కొంత కృత్రిమత, కొంత అహంకారం కూడా స్ఫురించాయి తొలి కార్యక్రమంలో. ఐతే ఎంపిక చేసిన ప్రశ్నలు, ఎంపికైన అభ్యర్థులు ఆ కార్యక్రమాన్ని ఆసక్తికరం, ఆకర్షణీయం చేశారనిపించింది. రెండు మూడు ఎపిసోడ్స్ చూసేసరికి- ఈ కార్యక్రమానికి అందాన్నిచ్చినదీ, ఇస్తున్నదీ నాగార్జునే అనిపించసాగింది. అప్పుడోసారి తొలి కార్యక్రమం మళ్లీ చూస్తే- మాది ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయమే తప్ప- ఆదినుంచీ ఈ కార్యక్రమం విషయంలో నాగార్జున చాలా హోంవర్క్, కృషి చేసినట్లు అనిపించింది. ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారాల్లో పాడుతా తీయగా తో సహా చాలా కార్యక్రమాల్ని పక్కనపెట్టి ఈ కార్యక్రమాన్నే మేము చూస్తున్నాం. వినోదానికీ, కాలక్షేపానికి, సామాజిక అవగాహనకి సహకరించే ఈ కార్యక్రమంలో వినపడిన కొన్నివిషాదగాథలు హృదయాల్ని కదిలిస్తాయి. నాగార్జున అభ్యర్థులతో వ్యవహరించే తనదైన తీరు హృద్యంగా ఉంటోంది. నాలుగు వారాలపాటు సోమ-గురు వారాలు వచ్చిన ఈ కార్యక్రమం నేటినుండి ఆదివారాలు కూడా ప్రసారం కానున్నది. పూర్తిగా నాగార్జున భుజస్కంధాలమీద నడుస్తున్న ఈ కార్యక్రమంపై ప్రేక్షకులుగా మా స్పందన ఇది. నాగార్జునకి అభినందనలు. ఈ కార్యక్రమాన్ని సామాజికస్పృహతో కలిపే మా విశ్లేషణని మరో సందర్భంలో మీతో పంచుకోగలం.  ఈ కార్యక్రమంపై జూన్ 24 న (మన్నించాలి- పత్రిక ఏదో గుర్తు లేదు) వచ్చిన ఈ వ్యాసాన్ని మీతో పంచుకుంటున్నాం.

nagarjuna karorpati ab

6 వ్యాఖ్యలు »

  1. This program is meant for “AIRTEL” users only. Why not this facility be extended to other service providers also? No doubt, the program is interesting, helping the viewers to shed their ignorance.

    • airtel is probably the sponsor. this is all nothing but business. otherwise there are crores of illiterate people, who can not participate in this programme, who are in dire straits and need immediate financial assistance.

  2. Sivakumara Sarma said,

    Another opinion – please change “Hunter” to “Hunger” in the title –
    https://groups.yahoo.com/neo/groups/racchabanda/conversations/messages/25706


Leave a Reply

%d bloggers like this: