జూలై 15, 2014

తెలుగు భాషకోసం….

Posted in సాహితీ సమాచారం at 8:50 సా. by వసుంధర

భాషగా తెలుగు భూతభవిష్యద్వర్తమానాలను పలువురు భాషాభిమానులు పలురకాలుగా విశ్లేషిస్తున్నారు. వాటిలో కొన్నింటిని శ్రీ దివికుమార్ అందజేశారు. వారికి ధన్యవాదాలు. ఆ వ్యాసాల్నిఇక్కడ ఇస్తున్నాం.

vijnapthi to govt  T bhaasha uniki1 T bhaasha uniki2  world telugu conference1 world telugu conference2 world telugu conference3

3 వ్యాఖ్యలు »

  1. Sivakumara Sarma said,

    ఎన్ని శిక్షణలయినా ఇవ్వచ్చుగానీ, భాషని తప్పనిసరిగా వాడవలసినవాళ్లకి, ఆ పదాలు ఏమయ్యుంటాయన్న ఆలోచన ఇసుమంతయినా దరికి రాకపోవడమే విచారకరం. నాదనీరాజనం కార్యక్రమంలో, “ఎందుపోతురా” అని మొదట కాగితమ్మీద రాసినవాళ్లూ, దాన్ని మాటలద్వారా వ్యక్తపరిచినవాళ్లూ, స్క్రీన్ మీద అక్షర రూపాన్నిచ్చినవాళ్లూ – కనీసం ముగ్గురు బాధ్యులు. వాళ్లకి సత్తావున్న మనిషి సూపర్వైజర్ గా లేకపోవడం, లేక, వున్నాగానీ, వారు తమ విధిని నిర్వర్తింపకపోవడం కూడా విచారకరమే.

  2. Sivakumara Sarma said,

    తెలుగుని అధికార భాషని చెయ్యడం సంగతి పక్కనపెట్టండి. భాష వచ్చుననుకుంటున్నవారి సంగతేమిటి? నిన్న శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్లో వచ్చిన నాదనీరాజనం కార్యక్రమంలో పాడబోయే కీర్తన “ఎందుపోతురా” అని అనౌన్స్ చెయ్యడమేగాకుండా స్క్రీన్ మీద కూడా అలాగే రాశారు. (దున్నపోతులో పోతులాగే అయ్యుంటుందనుకున్నారేమో!) పాపం ఆ కీర్తన రాసిన ఆయన “ఎందుబోదురా” అని పాడుకున్నాడు. పాడినది అరవావిడే అయినా, ఆ భాషలో త, థ, ద, ధ లకి ఒకే అక్షరాన్నీ, అలాగే, ప, ఫ, బ, భ లకి ఒకే అక్షరాన్నీ వాడినా ఆవిడ “ఎందుబోదురా” అనే పాడారు! ఇలాంటి తప్పిదాలు దొర్లకుండా వుండాలంటే ఏం చెయ్యాలి?

    • జర్మనీలో గోతే ఇన్‍స్టిట్యూట్‍లా= భాషకీ, ఉచ్చారణకీ ప్రాధాన్యమిచ్చే శిక్షణ సంస్థలు మనకిప్పుడు చాలా అవసరం. పాడుతా తీయగా కార్యక్రమంలో ఎస్పీబీ చేస్తున్నట్లుగా ప్రతి ఛానెల్‍కీ ఓ శిక్షకుడు అవసరం. కానీ ముందు మనం మన భాషని సీరియస్‍గా తీసుకోవాలి. అవగాహనకోసం ప్రాచుర్యంలో ఉన్న ఆంగ్ల భాషా పదాలను తెలుగులో వాడడంపై చర్చలు ఆపి- మన తెలుగు పదాల తెలుగుతనాన్ని కాపాడుకోవాలి. దీనికి మొదట ఇంట గెలవాలి. అంటే భాషాభిమానులు తమ ఇంట్లో పిల్లలకి తమకి తెలిసినంతలో సరైన తెలుగు నేర్పాలి. ఇండియాలో ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లల తలిదండ్రులూ, విదేశాల్లో సాహితీవ్యాసంగాల్లో చురుగ్గా పాల్గొనేవారూ కూడా- తమ పిల్లలకి తెలుగు రాకపోవడం సహజంగా, గర్వకారణంగా భావిస్తున్నారు. మన సినిమా హీరోలైన నాగెశ్వరరావు, కృష్ణ, చిరంజీవి వగైరాలు- తమ కుటుంబాలనుంచి సినీరంగానికి వారసుల్ని అందిస్తున్నారు కానీ- భాష, ఉచ్చారణలో శిక్షణ ఇవ్వడం లేదు. ఇది నేతల సమస్య కాదు. జాతి సమస్య. ఇంట గెలిస్తే కానీ రచ్చ గెలవలేం మనం.


Leave a Reply

%d bloggers like this: