జూలై 17, 2014

ఎవరో వచ్చారని ఏదో చేశారని

Posted in కళారంగం at 8:29 సా. by వసుంధర

మన సినీరంగంలో కళకంటే వ్యాపారానికే ప్రాధాన్యం. ఇక్కడ కులాలూ, మతాలూ, వర్గాలూ, ప్రాంతాలూ పేరుకి మాత్రమే. తెలంగాణకు చెందిన పోతన పాత్రని చిత్తూరుకి చెందిన నాగయ్య పోషిస్తే ఆంధ్రదేశమంతా విరబడి చూసి నివాళులు అర్పించింది. మనమిప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టి వ్యక్తుల ప్రాంతాలు తెలుస్తున్నాయి కానీ అప్పుడు అంతా తెలుగువారమనో, భారతీయులమనో అనుకునేవాళ్లం. మనం మన కళలని అదరించకపోతే అందుకు ఎవరినో కాదు- మనని మనమే తప్పు పట్టుకోవాలి.  1956లో ఆంధ్రప్రదేశ్ అవతరిస్తే- అన్ని ప్రాంతాలనుంచీ ఎంఎల్‍ఏలనీ, ఎంపీలనీ ఎన్నుకుంటున్నాం. వారు మాత్రం బాగుపడి వారి నియోజకవర్గాల పౌరులు, కళలు, సంస్కృతులు బాగుపడకపోతే అది కేవలం వారి తప్పు. సినీరంగంలో పూర్తి కళాత్మక చిత్రాలను ఆదరించే సంస్కృతి కాదు మనది. అవి ఏ ప్రాంతంనుంచి తీసినా జనం చూడరు. వ్యాపారాత్మక చిత్రాలు బాగుంటే ఏ ప్రాంతం హీరో నటించినా, ఏ ప్రాంతం దర్శకుడు తీసినా అన్నిప్రాంతాలవారూ ఎగబడి చూస్తారు (ఉదాహరణకి ఇటీవలి హార్ట్ ఎటాక్, రేసుగుర్రం). దీనికి ప్రాంతీయతనో, వర్గభేదాన్నో అంటగట్టడం- మనం మామూలుగా తాగే మంచినీళ్లని భూతద్దంలో చూసి సూక్ష్మక్రిములు ఉన్నాయనుకోవడమే. ఏ సంస్కృతి వెనుకబడినా, అందుకు ‘ఎవరో వచ్చారనీ ఏదో చేశారనీ బదులు పలికి మోసపోవడమే’ ఔతుంది. అన్ని సంస్కృతులూ వర్ధిల్లాలని కోరుకుంటూ కార్యాచరణకు పూనుకుందాం. అందుకు విభజన అవసరమైతే ప్రాంతీయంగా లాగే, సాంస్కృతికంగానూ విడిపోవచ్చు. కానీ మన ధ్యేయం ఆరోపణలు కావు. లక్ష్యసాధన. ఈ నేపథ్యం గుర్తుంచుకుంటె- నేడు ఆంధ్రభూమిలో వచ్చిన ఈ వ్యాసంలోని కొన్ని పాయింట్లు గమనించతగ్గవి.

film field

2 వ్యాఖ్యలు »

  1. బద్దెన సూత్రాలు గట్టెక్కినవారు చెబుతుంటే వినసొంపుగా ఉన్నై.

  2. Sivakumara Sarma said,

    తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసులో వున్నప్పుడు వచ్చిన ఏ చిత్రాల్లోనూ ఒక ప్రాంతాన్నిగానీ, ఒక యాసనిగానీ అవహేళన చేసినట్టు గుర్తులేదు. అది బిజినెస్ మైండ్లు రేషనల్‌గా ఆలోచించి తీసుకున్న నిర్ణయంవల్ల గావచ్చు. అదే పరిశ్రమ హైదరాబాద్ వచ్చాక, ఇది తెలుగు సినిమాయేకదా, తెలుగువాళ్లు ఎక్కడున్నాగూడా చూడకేం చేస్తారు అన్న అభిప్రాయంవల్ల వెరైటీగావుందని యాసలని ప్రవేశపెట్టుండొచ్చు. ఆ కారెక్టరులూ, ఆ సంభాషణలూ, హిట్టయ్యాయిగదా! “చిల్లర దేవుళ్లు” వంటి సినిమాలు హిట్టవకపోవడానికి ప్రాంతీయ దురభిమానం కారణం కాదని స్వాభిప్రాయం – తెలుగువాళ్లకి కావలసిన మషాలాలేవీ అందులో లేవు మరి! సినిమా అనేది ఎంటర్టెయిన్మెంటుకి మాత్రమే అనుకునేవాళ్లు అలాంటి సినిమాలను చూడకపోవడంలో విశేషమేముంది?


Leave a Reply

%d bloggers like this: