జూలై 19, 2014
కలహ భోజనుడు- లోకకల్యాణం
పురాణకాలంనాటి మన మీడియా నారదుడు. ఆయన చేరవేసేవి వార్తలే అయినప్పటికీ కలహభోజనుడని పేరు తెచ్చుకోవడం- నేటి మీడియాకు సాటివస్తుంది. ఆ కలహభోజనం లోకకల్యాణానికి దారి తీయడం- ప్రసారమాధ్యమంగా ఆయన అందజేసిన వార్తలకి అందమైన ముగింపు. ఆమేరకు నేటి మన మీడియాకి ఆయన ఎంతవరకూ ఆదర్శమో పాఠకులే చెప్పాలి. నేడు ఆంధ్రభూమిలో వచ్చిన ఈ వ్యాసంలో కొన్ని అంశాలు ఆలోచనాత్మకం.
Sarma Kanchibhotla said,
జూలై 20, 2014 at 6:12 సా.
శ్రీ నాగేశ్వరరావు గారి వ్యాసము సహేతుకముగను, సమంజసముగను, సమ్మతముగను, సశాస్త్రీయముగను, సర్వజనీనముగను ఉన్నదనుట యదార్ధము. ఆంగ్లపదములకు వారి తెలుగుసేత ఆమోదయోగ్యముగ ఉన్నది. వారికి అభినందనలు. రాముని కీర్తించటం రావణునికి కర్ణకఠోరముగ ఉన్నట్లు, కలియుగ రావణులకు ధీరోదాత్తుని గూర్చిన సమాచారము ద్వేషమును పెంచుట సమకాలీన సమాజములోకూడ గమనించుచున్నాము. తోడేలు మేకపిల్ల కధలోని నీతి ఈనాటికీ సమకాలీనత్వము కలిగియుండుట ఆ కధ చెప్పినవారి దార్శనికత తెలియజేస్తుంది. శ్రీ నాగేశ్వర రావు గారి వ్యాసము కొంతమంది ‘ పెద్దలకు ‘ కనువిప్పు కలిగిస్తుందని నా విశ్వాసము.