జూలై 30, 2014
ధ్యాన్చంద్రగ్రహణం
మన దేశంలో రాజకీయాల ప్రభావం ఏ స్థాయికి చేరుకుందంటే- ప్రభుత్వాలనుంచి పొందే అవార్డులు, గుర్తింపులకు ఉన్న విలువ సందేహాస్పదమౌతోంది. కేవలం రాజకీయాల్లో ఉన్న కారణంగా ఇతరత్రా ఏ ప్రతిభా లేకున్నా భారతరత్న వంటి అత్యున్నత అవార్డుని పొందినవారు ఉన్నారని అనుకునేవారున్నారు. ఇటీవలే క్రీడాకారులకి కూడా భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. ఆ ఆలోచన రాగానే అందరికీ స్ఫురించిన ఒకే ఒక్క పేరు హాకీ మాంత్రికుడుగా విశ్వవిఖ్యాతి గాంచిన ధ్యాన్‌చంద్. కానీ ఎప్పుడో కన్ను మూసిన ఆయనకంటే- ఇప్పుడు అందరిచేతా క్రికెట్ దేవుడు అనిపించుకుంటున్న సచిన్ తెండూల్కర్కి ఆ గౌరవాన్నివ్వడం ద్వారా తమకు రాజకీయంగా ప్రయోజనం ఉండవచ్చునని భావించినవారున్నారని నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వార్త సూచిస్తోంది. ప్రతిభలో సచిన్ ధ్యాన్‌చంద్‌కి దీటు వస్తాడన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. కానీ- ఆయనకు వయసుంది. సమయముంది. లేదూ ఒకేసారి ఇద్దరికి ఇవ్వకూడదన్న నియమం ఉంటే సడలించవచ్చు. సచిన్‌ని వరించి భారతరత్న అవార్డు విలువను సంతరించుకున్నట్లే- ధ్యాన్‌చంద్‌ని వరించక ఆ అవార్డుకి విలువ తగ్గదా అనుకునే వారుంటే ఆశ్చర్యం లేదు.
Leave a Reply