ఆగస్ట్ 1, 2014
సినిమాల్లో (వి)వస్త్రధారణ
మన చిత్రాల్లో అసభ్యత పెరిగిపోతున్నందుకు ఆవేదనతో నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసాన్ని మీతో పంచుకుంటున్నాం. ఐతే ఈ విషయంలో అలనాటి నటీమణులు నేటి తీరుకి పూర్తిగా భిన్నమని మేము అనుకోవడం లేదు. అలాగే ఈ తీరుకు బాధ్యత పూర్తిగా నటీమణులది కాదు. వారితో కలిసి నటిస్తూ ఆ అసభ్యతలో పాలు పంచుకుంటున్న హీరోలు వారిని అలా తీర్చిదిద్దుతున్న దర్శకులు, అలాగే తీర్చిదిద్దమంటున్న నిర్మాతలు, వారికి అభిమానులై అలాంటి చిత్రాల మహా విజయానికి దోహదం చేస్తున్న ప్రేక్షకులు కూడా ప్రముఖపాత్ర వహిస్తున్నారన్న విషయం విస్మరించకూడదు.
Sivakumara Sarma said,
ఆగస్ట్ 2, 2014 at 3:07 ఉద.
దురదృష్టమేమిటంటే, వ్యాసకర్తలందరూ ఇండియాలో చెలరేగే ప్రతీ వికారానికీ విదేశాలని – అందులో ముఖ్యంగా పాశ్చాత్యదేశాలని – ఆడిపోసుకోవడం. హాలీవుడ్ సినిమాలల్లో శృంగారభరితమైన సీన్ వుంటే తప్ప నటీమణులు అర్ధనగ్నంగానో కొండొకచో నగ్నంగానో కనిపించరు. టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్లు స్కర్టులతో కనిపించడం మొదలుపెట్టి అతి తొందరగా బికినీల్లోకి మారిపోతారు. టాలీవుడ్ సినిమాలకి ఎప్పటినించో మహారాజపోషకులు యువకులు మాత్రమే. “దసరాబుల్లోడు” సినిమాని విజవంతం చేసినది నలభయ్యేళ్లకి పైబడినవాళ్లని ఎవరయినా చెబితే పగలబడి నవ్వాల్సొస్తుంది. “అడవిరాముడు”లో జయప్రద అందాల ఆరబోత 1975లో – దాదాపు నలభయ్యేళ్ల క్రితం – జరిగిందిగదా! దాన్ని విజయవంతం చేసినదెవరు – కుర్రకారా యాభయ్యేళ్లు దాటినవాళ్లా? జయలలిత జయమాలినుల వేషధారణలు ఆయా కాలాల్లో సభ్యత హద్దులని తగ్గించడానికి కృషిచేసినవే. వాళ్లు అలా చెయ్యబట్టే ఈనాటి హీరోయిన్లకి ఇలాంటి వస్త్రధారణ చూస్తున్నాం. వ్యాసకర్త లక్ష్యం ఎవరో నాకు అర్థంకాలేదు. యాభయ్యేళ్లకి పైబడినవాళ్లంటారా, అసలు ఈ వ్యాసాన్ని ఎంతమంది చదివివుంటారంటారు? యువత(ముఫ్ఫయ్యేళ్ల కన్నా వయసు తక్కువవాళ్లు)లో ఎంతమందికి తెలుగు చదవడం వచ్చు? ఇంకపోతే మిగిలిందెవరు?
Sarma Kanchibhotla said,
ఆగస్ట్ 2, 2014 at 11:06 సా.
చట్ట సభలలో చర్చల వలె ఉన్నది. విపక్షం వెలిబుచ్చిన విషయాలలోని మంచిని గ్రహించకుండా, విపక్షము అధికారములో చేసిన పనులను ఏకరువుపెట్టి ఎదురుదాడికి దిగినట్లు సాగుతున్నై స్పందనలు. వర్తమాన దృశ్యం సమంజసమా, అసమంజసమా అనేదానిగురించి స్పందిస్తే బాగుండునని నా మనవి.
Sivakumara Sarma said,
ఆగస్ట్ 3, 2014 at 6:35 సా.
శర్మగారి వ్యాఖ్యకు నా జవాబు –
సమంజసమా అసమంజసమా అనేవి వ్యక్తిగతమయిన అభిప్రాయాలుగా తీసిపారెయ్యకుండావుండాలంటే సంఘంలోని పరిమాణాలని, పరిణామాలనీ ఉదహరించాలి. వాటి ఆది, అంతాలని అర్థంచేసుకోవాలి. ఆ సమగ్రత కనిపించనప్పుడే వ్యాసంలో లోపించిన విషయాలగూర్చి ఆలోచించమని అడుగుతారు. ఈ వ్యాసంలో ఈ వస్త్రధారణ అసమంజసం అని నొక్కివక్కాణించారు. సినిమా పరిశ్రమకి సంబంధినవాళ్లేగాక ఆ సినిమాలని ఆదరిస్తున్న ప్రజానీకమంతా ఇది సమంజసమేనని వాదించకుండానే (టిక్కెట్లని కొని, ఆ సినిమాలని చూసి) తెలుపుతున్నారు. అందుకే, వ్యాసకర్తని ఈ వ్యాసం ఎవరిగూర్చి రాశారని ప్రశ్నించింది.
నలభయ్యేళ్లక్రితపు జయమాలిని, జయలలితల వస్త్రధారణ ఆమోదయోగ్యం అన్న వ్యాసకర్తని, “అవి ఆ కాలపు పెద్దవాళ్లకి అభ్యంతరకరమై వుండొచ్చుగదా! (మా తల్లిదండ్రులని ఆ కాలపువాళ్లకి ప్రతినిధులుగా తీసుకోంటే అవి నిస్సందేహంగా అభ్యంతరకరమే!) అప్పటి కుర్రకారు ఇప్పటి వృధ్ధులై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్టున్నారు!!” అని ఆలోచించమని వ్యాసకర్తని అడగడంలో తప్పులేదనుకొంటాను.