ఆగస్ట్ 7, 2014
అనుచితాలు
రాజకీయనాయకులు పదవిలోకి రావడానికి కొత్త విధానాలను వాగ్దానంగా ఇవ్వచ్చు. కానీ ఆర్థికపరమైన వాగ్దానాలు చేసినప్పుడు- వాటికి ప్రజాధనాన్ని ఉపయోగించడం న్యాయం కాదు. తమ పార్టీ ఆ బరువు, బాధ్యతల్ని స్వీకరించడం సబబు. ఋణభారంతో తలమునకలౌతున్న మన రైతన్నలకు ఊరట, తోడ్పాటు కలిగించే ఏర్పాటు అవసరమని అందరూ ఒప్పుకుంటారు. అందుకు తగిన విధానాల్ని రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కానీ ప్రజాధనంతో ఋణమాఫీలు వాగ్దానం చెయ్యడంలోని పొరపాటు, ఇబ్బంది వగైరాలన్నీ ఇప్పుడు చూస్తున్నాం. మున్ముందు రాజకీయనాయకులు ఇటువంటి అనాలోచిత వాగ్దానాలకు పాల్పడరని ఆశిస్తూ నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం మీతో పంచుకోవాలని….
Sarma Kanchibhotla said,
ఆగస్ట్ 8, 2014 at 12:40 ఉద.
ఉచితానుచితాల ఊసులు రైతుల ఋణమాఫీ విషయమొచ్చేసరికి చర్చ (రచ్చ, రచ్చ) జరుగుతోంది. మేధావులు ఉ.అ విశ్లేషణలు చేస్తున్నారు. ప్రజల ధనమన్న నిజాన్ని ఎత్తి చూపుతున్నారు. సామాన్యుడిగా నా అనుమాలలో కొన్ని:
పారిశ్రామిక రంగానికి బ్యాంకుల ప్రజాధనమును అప్పుల రూపముగా ఇచ్చినదానిలో నిరర్ధక ఆస్థులెంత? రాజీ పడి బ్యాంకులు రద్దు చేసినదెంత?
ఎగుమతి దిగుమతులలో జరిగే అక్రమాల ద్వారా ప్రజా ప్రభుత్వాలకు జరుగుతున్న నష్టమెంత?
నల్ల ధనపు వీర విహారాన్ని కట్టడి చేయని ప్రజాప్రభుత నిష్క్రియాపరత్వము వలన జరిగిన, జరుగుతున్న నష్టమెంత?
సమాజములో ఊడలమర్రి వలె విస్తరించిన అవినీతి వలన ప్రజలు నష్టపోతున్నదెంత?
కేవలము అసంఘటిత రంగమైన వ్యవసాయమునకు వచ్చుసరికి ఉచితానుచితాలు వల్లెవేయు అధికారగణం దృక్పధములో సమ్మూలమైన మార్పు రానిఎడల వ్యవసాయ ఆధారిత భారతము ఒక కంటి వెంట మంటలు తప్పవు.
చివరిగా ఒక మాట: రైతుల ఈ స్థితికి ప్రకృతితోపాటు పాలకుల పాత్ర ఎంత?
ఆత్మ పరిశీలన చేసుకొని పరిష్కారములు నిస్పక్షపాతముతో కనుగొన వలెనని నా అభిప్రాయము.
సమయాభావము, స్థలాభావమువలన ఇప్పటికి వీటితో ఆపినాను. లోగుట్టు ఎరిగిన పెరుమాళ్ళకు వివరించేపని లేదు కదా !
అన్నదాతా సుఖీభవ.