ఆగస్ట్ 7, 2014
హిమ ఆలయాలకు యాత్రాయాసాలు
మనది సెక్యులర్ దేశం. సెక్యులరిజం అంటే అన్ని మతాలవారూ తమ సంప్రదాయాల గురించీ, ఆలయాల గురించీ యథేచ్ఛగా మాట్లాడొచ్చు. కానీ హిందూ మతం గురించీ, హిందూ ఆలయాల గురించీ ప్రస్తావించడం సెక్యులరిజానికి విరుద్ధం అనేవారూ, అనుకునేవారూ ముఖ్యంగా మీడియాలో ఎక్కువ. ఆ సందర్భంగా నేడు ఆంధ్రభూమిలో సంపదకీయంగా వచ్చిన ఈ వ్యాసం అభినందనీయం. మీతో పంచుకోవాలని….
Sarma Kanchibhotla said,
ఆగస్ట్ 13, 2014 at 12:17 ఉద.
కుహనా లౌకికవాదులు, ” అసమర్ధ మేధావులు ” మనదేశ భక్తులను అనేక విధాల నిర్వీర్యము చేసే అరాచకీయము కొనసాగిస్తూనే వున్నారు. పతనావస్థ గత పది సంవత్సరాలలో పరాకాష్ఠకు చేరింది. రాజకీయ వ్యభిచారులు, రాజకీయ దళారులు వేరుపురుగులవలె హిందూజీవన విధానమనే వృక్షాన్ని సమూలనముగా నాశనము చేయుటకు ‘ చేతి ‘ కి కంకణము కట్టుకొని ముఠాలు కట్టి సాగించే చాటుమాటు కుయుక్తులకు చెప్పు దెబ్బలు 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు. ఐతే బానిసభావాలు నరనరానా జీర్ణించుకొన్న ఈ ముఠాలు ఆ పరాభవాన్ని గుణపాఠముగా గ్రహించక ప్రతి సందర్భములోను కుయుక్తులతో ప్రజల తీర్పును పరిహసించుచు” వెనుకటి గుణములనే ” ప్రదర్శించుటకు మొన్నీమధ్య లోక్ సభలో ప్రతిపక్షహోదాకూడ పొందలేని అధమస్థితికి చేరుకొన్న పార్టి వారు ప్రదర్శించిన హేయమైన ప్రవర్తన ఒక ఉదాహరణ. లౌకికమన్న పదమునకు సరియగు భాష్యమును చెప్పు ” మిత్రవాక్యమును ” వినకపోవుట దేనిని సూచిస్తుందో విజ్ఞులు గ్రహించినారు. చార్వాకుల అవాకులు చవాకులకు విలువనీయక లౌకిన విధానమును త్రికరణశుద్ధిగా అమలుచేయగరని నమ్మి అధికారమును కట్టబెట్టిన ప్రజలు అప్రమత్తులై ప్రజాస్వామ్య బద్ధముగ రాజ్యాంగస్ఫూర్తితో సాగించుచున్న పరిపాలకులకు అన్ని విధములుగా అండగా నిలిచి ‘మన ‘ మనుగడను కాపాడుకోవాలి. వ్యాస రచయితకు నా అభినందనములు, అభివందనములు.