ఆగస్ట్ 8, 2014

అనుచితాలు- కొన్ని స్పందనలు

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:56 సా. by వసుంధర

నిన్నటి టపా అనుచితాలుపై శ్రీ కంచిభొట్ల శర్మగారి స్పందనలో తర్కం విషయం ఎలా ఉన్నా న్యాయమైన ఆవేదన ఉన్నది. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన మరి రెండు  వ్యాసాలు మీతో పంచుకుంటున్నాం.

loan waiver aj loan waiver 2 aj

1 వ్యాఖ్య »

  1. రాజకీయ ప్రయోజనాలకొరకు ఆర్ధిక సంస్థలను పావులుగా వాడుకోవటం 1969 నుండి విజ్ఞులు గమనిస్తున్నారు. రైతు ఋణమాఫీ ఇప్పటికి రెండు సార్లు కేంద్రప్రభుత్వాలే చేసినై. ఋణ వితరణ, ఋణ సంతర్పణల వల్లా బ్రతికి బట్టకట్టిన కేంద్ర ప్రభుత్వాల జ్ఞాపకాలు ఉన్న తరపు ప్రజలు ఇంకా ఈ సమాజములో ఉన్నారు. దీని అర్ధం : ఈ తరహా వాగ్దానాలు చేసిన పార్టీలు కేంద్రములో అధికారములోకి వస్తే అది సక్రమము, అదే తరహాలో రాష్ట్రములలోకి అధికారములోకి వస్తే అది అక్రమమా? “రామ, రామా !” ఇదెక్కడి న్యాయం?
    తెలుగు ముఖ్యమంత్రులిద్దరు విద్యాధికులే! రైతులను ఆదుకోవలెనన్న ధృఢసంకల్పమున్నవారే. విదేశి విద్యా పరిజ్ఞానము కాక దేశీయతనుండి అందునా సామాన్య స్థాయినుండి ప్రధానమంత్రి పదవినలంకరించిన వ్యక్తి శ్రీ నరేంద్ర దామోదరదాస్ మోదీ. ఈ పరిస్థితులలో ఒక పరిష్కారము కనుగొని అన్నదాతలను ఆదుకొంటారనే విశ్వాసము రైతులలో ధృఢముగా ఉన్నది. పుస్తక పరిజ్ఞానము దేశీయ పరిస్థితులకు అనుగుణముగా అన్వయించి దేశప్రజలకు మేలుకలిగే మార్గదర్శకాలు ఇచ్చు దృక్పధము రిజర్వ్ బ్యాంకు అధికారులకు కలుగజేయుట నేటి అవసరము.
    మరొక్క మాట: రైతుల సమగ్ర అవసరాలు తీర్చు ప్రణాళికలు రచించమని, గ్రామీణ రైతు రుణములకు మారటోరియం విధిస్తూ చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వమునుకూడ ఈ స్వతంత్రభారతములో ప్రజలు చూశారు. సర్వశ్రీ శ్రీనివస్, విజయకుమార్ గార్లకు నా అభినందనలు


Leave a Reply

%d bloggers like this: