ఆగస్ట్ 15, 2014
మనం భారతీయులం
మనకు స్వతంత్రం వచ్చి 67 ఏళ్లయింది. స్వతంత్రులుగా మాత్రం మనమింకా పసిపాపలం. పసిపాపలు తమకు తాముగా ఏమీ చెయ్యలేని, చేసుకోలేని అసహాయులు. వారికి పోషించే, నడిపించే, రక్షణనిచ్చే పెద్దలు కావాలి. జాతి, మత, ప్రాంత, కులాల్ని పక్కనపెట్టి మనమంతా భారతీయులం అనుకునే రోజు వచ్చేదాకా మనలో ఎదుగుదల మొదలవదు. ఐతే మనలో దేశభక్తి లేకపోలేదు. అది ఏ పరిస్థితుల్లో మరుగున పడుతున్నదో, ఏ పరిస్థితుల్లో బయటపడుతున్నదో విశ్లేషిస్తూ విజయ మాసపత్రికలో (సెప్టెంబర్ 1977) వచ్చిన మా కథ మనం భారతీయులం విశ్లేషించింది. ఇప్పటికీ మనమింకా అదే మనోస్థితిలో ఉన్నామనిపిస్తోంది. అలనాటి దేశభక్తుల మనోగతాన్ని మనోహరంగా స్పష్టం చేసిన ఈ క్రింది వ్యాసం (ఆంధ్రభూమి దినపత్రిక ఆగస్ట్ 15, 2014)- నేటి యువతకు స్ఫూర్తి కాగలదని ఆశ. వ్యాసకర్తకు అభినందనలు.
Leave a Reply