ఆగస్ట్ 15, 2014

స్వాతి చినుకులు

Posted in టీవీ సీరియల్స్ at 1:01 సా. by వసుంధర

https://i2.wp.com/vasumdhara.com/wp-content/uploads/2013/09/swathi-chinukulu-_footer.jpg?w=470

ఆరంభంలో- ఇంతవరకూ వచ్చిన తెలుగు టివి సీరియల్సు అన్నింటికీ భిన్నంగానూ, విశిష్టంగానూ అనిపించిన ఈ సీరియల్ గురించి గతంలో విశ్లేషించి ఉన్నాం.

ఈ సీరియల్ తొందరగా ముగిసి ఉంటే బాగుండేదేమో అనిపించేలా ‘కొన’సాగుతోంది ఇప్పుడు. మనకి తెలిసిన అన్ని డెయిలీ సీరియల్సు మూసలోకీ మారిపోయిన ఈ సీరియల్లో ముఖ్యపాత్ర మైథిలి పాత్రధారిణి మారింది. అలాగే మిగతా నటీనటుల్నీ మార్చేస్తే బాగుండేదేమో. ఎందుకంటే ఆ పాత్రలన్నింటికీ తమదంటూ వ్యక్తిత్వాలుండేవి. సంఘర్షణ ఆ వ్యక్తిత్వాలమధ్య జరిగేది. ఇప్పుడు సన్నివేశాలే తప్ప వ్యక్తిత్వాలు లేవు. మంచికైనా, చెడ్డకైనా అందరూ ఒకేలా ప్రవర్తిస్తారు. కథను సాగదియ్యడానికే సహకరిస్తారు. 

ఇంత మంచి సీరియల్ ఇలా మారడం- తెలుగు టివి సీరియల్సులో కథకు బొత్తిగా భవిష్యత్తు లేదన్న నిరాశ కలిగిస్తుంది. సృజనాత్మకతకు మచ్చుగా మొదలై- సృజనాత్మకత సోదిలోకి కూడా దొరకని దశకు చేరుకోవడంవల్ల ఈ సీరియల్‍కి కాన్సెప్ట్ మనకున్న సృజనాత్మక సినీదర్శకుల్లో ఒకరైన క్రిష్ కావడం మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతానికి స్వాతి చినుకులు నదీనాం సాగరో గతిః అనిపిస్తున్నాయి.

Leave a Reply

%d bloggers like this: