ఆగస్ట్ 27, 2014

మేడ్ ఇన్ చైనా

Posted in వ్యాపారం at 9:22 సా. by వసుంధర

comment adivaram 24

                ఆంధ్రజ్యోతి ఆదివారం ఆగస్ట్ 24

1 వ్యాఖ్య »

  1. Sivakumara Sarma said,

    “అయినా ఖరీదైన కొత్త వస్తువుల్ని తయారుచేసి ఆర్థిక అంతరాలను పెంచేవాళ్లకంటే..” అన్న అభిప్రాయాన్ని చూసి రచయిత అవగాహనా రాహిత్యానికి జాలిపడాలో లేక తను పుక్కిటపట్టినవాటిన్నింటినీ ఒక్క ఫ్రేజ్‌లో గుప్పించినందుకు మెచ్చుకోవాలో తెలియని పరిస్థితి. ఇటు ఆర్థికశాస్త్రంవైపు చూద్దామా అంటే, “కొత్తవస్తువుల్ని తయారుచేస్తే ఆర్థిక అసమానతలు పెరుగుతాయి” అన్న ప్రతిపాదనని చేసినవారెవరో రచయిత చెప్పాలి (వారే ప్రథములయినట్లు కనిపిస్తున్నారు!) ఇలా చూస్తే, కొత్తవస్తువుల తయారీని నిషేధిస్తూ ఆజ్ఞలని జారీచేస్తే సరి! ఆ అసమానతలు ఇట్టే ఎగిరిపోతాయి. ఇకపోతే, కొత్తవస్తువులని తయారుచేసినప్పుడు వాటిని కొనుక్కునేవాళ్లు అసలు లేకపోతే ఏ సమస్యా వుండదు. కానీ, వాటినికూడా కొనుక్కోగలిగినవాళ్లు వుండబట్టే అవి అమ్ముడవుతున్నాయి. అంటే, ఈ అసమానతలనేవి కొత్తవస్తువుల తయారీకి ముందునుంచే వున్నాయి. పైగా, చైనావాళ్లు కొత్తవస్తువులని చవకగా తయారు చెయ్యగలుగుతున్నారు అంటే అలాంటివాటిని ముందు ఎవరో తయారుచేస్తే, వాటి నమూనాలని చూసి – వినాయకుడి విగ్రహంలాంటి వాటికి, లేకపోతే పాశ్చాత్యదేశాల్లో ప్రచురింపబడే పుస్తకాలకి – లేకపోతే వాటి కీళ్లు ఊడదీసి చూసి (టెక్నాలజీ ఐటంస్‌కి), అలాంటివాటిని తయారుచెయ్యడం సాధ్యమవుతోంది. అంటే, చైనావాళ్లు నడవడానికి బాటని ముందుగా ఇంకొకళ్లు వెయ్యాలి. అప్పుడువాళ్లు దాన్ని అభివృధ్ధి చేస్తారు!
    దీన్ని చదివి, “ఇదేమైనా వేదమంత్రమా, అంత చిన్న సమాసానికి ఇంత పెద్ద వ్యాఖ్య!” అని కొందరు కినుక వహించవచ్చు. వారికి ముందుగానే క్షమాపణలని చెప్పుకుంటున్నాను.


Leave a Reply

%d bloggers like this: