ఆగస్ట్ 29, 2014

అలనాటి చిత్రం- వినాయక చవితి

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:23 సా. by వసుంధర

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ వారు అన్నదాత అనే చిత్రంతో సినీనిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ సంస్థనుంచి వచ్చిన రెండో చిత్రం వినాయక చవితి. ఇందులో టైటిల్ సాంగ్‍గా ఘంటసాల పాడిన హం వాతాపి గణపతిం భజే అన్న కీర్తన ఇప్పటికీ పర్వదినాల్లో ప్రముఖమై వినిపిస్తూంటుంది. ఘంటసాల సూర్య భగవానుని ప్రస్తుతిస్తూ పాడిన మరో పాట ‘దినకరా’ ఇప్పటికీ తరచుగా వినిపించినా నిత్యనూతన గేయం. ఆ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చాయి. ఈ క్రింద ఇస్తున్నాం. అశ్వరాజ్ వారి మూదవ చిత్రం దీపావళి. ఆ తర్వాత ఈ సంస్థనుంచి ఇంకా చిత్రాలు వచ్చేయేమో తెలియదు.

vinayaka chaviti movie

 

 

Leave a Reply

%d bloggers like this: