ఆగస్ట్ 29, 2014

తెలుగుకు గొడుగు పట్టిన గిడుగు

Posted in భాషానందం at 7:10 సా. by వసుంధర

చక్కని తెలుగు మాట్లాడే మళయాళీ అమ్మాయి సుమ నిర్వహణలో స్టార్ మహిళ కార్యక్రమం- ఈరోజు వినాయక చవితినీ, తెలుగు భాషా దినోత్సవాన్నీ సంస్మరించింది. ‘చదువుకునే రోజుల్లో మా అమ్మ నన్ను తెలుగును రెండవ భాషగా తీసుకోమని చెప్పడం నాకెంతో మేలు చేసింది. తెలుగు లేకపోతే ఒక వ్యాఖ్యాతగా ఇలా రాణించే అవకాశం నాకొచ్చేది కాదేమో’ అన్న సుమ మాటలు నేటి విద్యార్థులు ఎందరికో కనువిప్పు, ప్రేరణ కావాలి. తెలుగు భాషా దినోత్సవ్ సందర్భంగా- ఆ కార్యక్రమంలో పాల్గొన్న యువతుల్ని తెలుగు పద్యం చదవమని సుమ ప్రోత్సహించగా- ఒకామె పారిపోయింది. ఒకామె నేను చదువుతానని ముందుకొచ్చి’సరస్వతీ నమస్తుభ్యం’ అన్న శ్లోకాన్ని తప్పులు లేకుండా పూర్తిగా చదివింది. అది తెలుగు పద్యం కాదనీ, సంస్కృత శ్లోకమనీ, రెండూ ఒకటి కాదనీ ఎవరూ చెప్పలేదు. ఇక్కడే కాకుండా చాలా టివి కార్యక్రమాల్లో (మీలో ఎవరు కోటీశ్వరుడుతో సహా) మన యువత తెలుగు, తెలుగుతనం పట్ల పరిజ్ఞాన రాహిత్యం బయటపడుతోంది. బాధపడాల్సిన విషయం ఏమిటంటే అందుకు వారు సిగ్గుపడి, తమ పరిజ్ఞానాన్ని పెంచుకుంటామని అనడం లేదు. కొందరు గర్వపడుతున్నారు. కొందరు వేళాకోళంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యలో నేటి దినపత్రికల్లో వచ్చిన ఈ వ్యాసాలు ఎంతో సబబైనవి. వ్యాసకర్తలకు అభినందనలు.

gidugu

                                  ఆంధ్రజ్యోతి

gidugu

                                       ఈనాడు

telugu

                                       ఆంధ్రభూమి

Leave a Reply

%d bloggers like this: