సెప్టెంబర్ 5, 2014
ఉపాధ్యాయుడు గురువు కాదా?
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భరతావని గర్వించతగ్గ తత్వవేత్త. రాష్ట్రపతిగా ఆ పదవికి వన్నె తెచ్చి, భారతరత్నగా ఆ బిరుదుకి విలువనిచ్చిన ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినంగా జరుపుకుంటున్నాం మనం. దానికిప్పుడు గురు ఉత్సవ్ అని పేరు పెట్టాలన్న ప్రతిపాదన ఒకటి వచ్చింది. అది ఎంతో వివాదానికి గురయింది. ఉపాధ్యాయ శబ్దానికి బదులు గురు శబ్దం వాడితే అది సర్వేపల్లి వారికి అవమానమా? వారు గురువులు కారా లేక దీని వెనుక రాజకీయ కుతంత్రమున్నదా- ఉంటే అది ఏమిటి? నేటి దినపత్రికల్లో వచ్చిన ఈ క్రింది వ్యాసాలు చదివినవారికి ఏమైనా తెలిస్తే- అక్షరజాలంలో ఆ వివరణ ప్రకటించగలం.
ఆంధ్రజ్యోతి
ఈనాడు
ఈనాడు
Sarma Kanchibhotla said,
సెప్టెంబర్ 7, 2014 at 11:53 సా.
టీచర్స్ డే అన్న ఆంగ్లపదానికి సమానార్ధకమే గురు ఉత్సవ్. మార్పు దేశీయతకోసమువలెనే ధ్వనిస్తోంది. దీనికి అభ్యంతరమేమిటో నాకు అర్ధం కాలేదు. వివరింపగలరు. ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్రస్థాయిలోను, కేంద్రస్థాయిలోను సన్మానించుట రాజ్యాంగమును ధిక్కరించినట్లా? క్రీడలలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొందరిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సన్మానించుటలేదా?