సెప్టెంబర్ 5, 2014

నమో నమో బాపూ 4

Posted in కళారంగం at 4:31 సా. by వసుంధర

‘బాపు’ చిత్రాలు ముత్యాలముగ్గులు

bapu ab

  • 05/09/2014       ఆంధ్రభూమి దినపత్రిక
  • -బాబ్జీ, సినీ దర్శకుడు

బాపు తొలి సినిమా ‘‘సాక్షి’’ని ప్రజల మధ్య తీసిండు! పల్లెటూర్లో తీసిండు! పల్లె అందాలతో సినిమా రీళ్ళను నింపేసిండు! పల్లెటూరి జనాల నైజాలను, నిజాలను, తత్వాలను, మనస్తత్వాలను, వ్యక్తిత్వాలను వెండితెరపై ఆరబోసిండు! సినిమా దగ్గరికి ప్రజలు కాదు ప్రజల దగ్గరికి సినిమా వెళ్ళాలనే సిద్ధాంతంతో సినిమా షూటింగ్‌లను ప్రజల దగ్గరికెళ్ళి తీస్తే, యిది మా సినిమా అనుకున్న ప్రజలు సినిమా హాళ్ళదగ్గరికి పొలోమని పరిగెత్తి ‘‘ఓరి సుబ్బిగో… ఓసి రత్తాలో యిది మన సిన్మానే’’ అని ఎలుగెత్తి చాటారు-! ‘‘బుద్ధిమంతుడు’’ సినిమాలో అక్కినేనితో రెండు పాత్రలు చేయించి ఒకరిని ఆస్తికుడిగా, మరొకరిని నాస్తికుడిగా చూపించినప్పటికీ చివరాఖరికి ప్రజలకోసం పోరాడేవాడు, సమాజంలో అవినీతి, అక్రమాలపై దండోరా మ్రోగించినోడు నాస్తికుడైనా దేవుడు అతనే్న యిష్టపడతాడని’’- డప్పు కొట్టినట్లు చెప్పాడు మన సత్తారాజు! ‘‘గుళ్ళో ఏముంది బళ్ళోనే వుంది’’అనే పాటలో గుడి మనిషిని మారుస్తుందో లేదో చెప్పలేము కాని బడి మాత్రం సమస్త మానవజాతిని మారుస్తుందని గొంతెత్తి ఉద్ఘాటించాడు-! ‘‘అందాల రాముడు’’ చిత్రంలో పేద, ధనిక తారతమ్యాలపై, సనాతనాల బూజుపై, కులం మతం రివాజుపై, పురాణ నమ్మకాలపై తుఫాను రేపే సంభాషణలను వీలుదొరికిన చోట్లల్లా మొట్టికాయల్లా వేశాడు! ‘‘రాముడేమన్నాడు… సీతారాముడేమన్నాడోయ్‌ఁ…’’ అనే పాటలో ‘‘మనుషుల్లారా మాయామర్మం వద్దన్నాడోయ్‌ఁ..!’’అంటూ తనదైన సౌమ్య బాటలోనే సామ్యవాదాన్ని వినిపించాడు! ‘‘పెరగడానికెందుకురా తొందరా’’అనే పాటలో భావిభారత పౌరులైన విద్యార్థులను బానిసలుగా, బావిలోని కప్పలుగా మారుస్తున్న మెకాలే విద్యావిధానంపై, విద్యావ్యాపారంపై తిరుగుబాటును సెటైర్ల రూపంలో సంధించాడు. ప్ర పంచంలో చానా మందే వున్నారు.. నువ్వున్నావు నేనున్నాను వాడున్నాడు వీడున్నాడు అతడున్నాడు ఆమే వుంది! ఇంకా సానామంది వున్నారు- ఆళ్ళందరూ సచ్చిపోకుండా ‘‘సత్తిరాజు’’ సచ్చిపోనాడంటే మాత్రం నేను నమ్మను. నమ్మనుగాక నమ్మను..! ఎందుకంటే అదీ దేముడికీ, సత్తిరాజుకు మధ్య కుదిరిన ఎగ్రిమెంట్! అప్పటికే సానా ఏళ్ళనుంచి దేముడు బొమ్మలు తయారుచేసి చేసి అలసిపోనాడు-! ఆ బొమ్మలన్నీ ఒకే రకంగా వుండడంతో రొటీన్ జీవితం, రొటీన్ వర్క్ అంటూ బోర్ కొట్టిందాయనకు-! ఛత్‌ఁ.. అంటూ ఉలిని పక్కన పడేసి శానా రోజులపాటు బొమ్మల్ని తయారుచేయడం మానేశాడు! లోకంలో బొమ్మల దిగుమతి ఆగిపోనాది! ఎందుకేమిట్రా అని ఆలోచించినోళ్ళున్నారు.! మనకెందుకులేరా అంటూ గమ్ముగున్నోళ్ళూ వున్నారు! సత్తిరాజు మాత్రం అలా అనుకొని ఊరుకోలేదు! కుంచె కాగితం చేతబట్టుకొని బరబరా దేముడ్ని గీసేశాడు! ఎదురుగా నిల్చోబెట్టుకొని నిలదీశాడు! ‘‘ఎందుకయ్యా సామీ నువ్వు బొమ్మల్ని తయారుచేయడం మానేశావు. ఇట్టసేత్తే మా మడుసులు ఏంకావాలి’’- అని నిలదీశాడు! ‘‘అయినా యిదేం బాగోలేదయ్యా. నీలాంటి పెద్దమనిషి జేయాల్సిన పనేనా అది’’- అని నిగ్గదీశాడు! దీంతో తప్పదనుకొని దేముడు నోరు విప్పి అస్సలు సమస్య చెప్పేశాడు! ‘‘చూడు సత్తిరాజు.! శానా రోజుల్నుంచి బొమ్మల్ని తయారుజేస్తున్నానయ్యా. కానీ ఒక్క బొమ్మ కూడా కంటికి ఆనడం లేదు! కొద్దిగైనా అందంగా ఉండడం లేదు! అందుకే చిర్రెత్తుకొచ్చి బొమ్మల్ని తయారుచేయడం మానేశానన్నాడు! ఆ మాటలు విన్న సత్తిరాజుకు నవ్వొచ్చింది! ఎట్టాపడితే అట్టా దేముడి ముందు నవ్వెయ్యకూడదు కదా అందుకే నోటికి చెయ్యడ్డం పెట్టుకొని పుసుక్కున నవ్వేడు సత్తిరాజు- అదిగో అప్పుడు కుదిరింది దేముడికి, సత్తిరాజుకు మధ్య అగ్రిమెంటు! వెంటనే కుంచె అందుకొని బరబరా ఓ బొమ్మ గీశాడు సత్తిరాజు! అదో అందమైన అమ్మాయి బొమ్మ- అదో చందనాల చెమ్మ లాంటి బొమ్మ… కుందనాల రెమ్మలాంటి బొమ్మ..! ఆ బొమ్మ నడుస్తుంటే పిరుదుల మీద నల్లని వాల్జడ నాగుపాములా తన్నుకులాడుతోంది! ఆ బొమ్మ నడుము ఒంపుల్లో నైరుతి పవనాలు తచ్చాడుతున్నాయి! ఆ బొమ్మ కాటుక కళ్ళల్లో కన్రెప్పలు టపటపలాడితే ఆకాశంపై వున్న ఇంద్ర ధనస్సు తొంగి తొంగి చూస్తు జొల్లు కార్చుకుంటుంది- అంతటి అందమైన ఆడబొమ్మను చూసిన దేముడు నివ్వెరబోయాడు! సిగ్గడిపోయాడు! తన సృష్టిలో అంతటి అందమైన బొమ్మ ఒక్కటైనా లేదే అని తనలోతాను తెగ బాధపడిపోయాడు! ‘‘అయ్యా సత్తిరాజు.! ఇప్పటినుంచి నువ్వు బొమ్మలు గీయి. నేను ప్రాణంపోస్తాను’’అంటూ అగ్రిమెంట్ చేసుకున్నాడు! అంటే… ఇకనుంచి మన సత్తిరాజు అదేనండి మన ‘‘బాపు’’కాగితాల మీద, కాన్వాసుల మీదా బొమ్మలేయడం మానేసి ఏకంగా కదిలే బొమ్మలను, మాట్లాడే బొమ్మలను, మనసున్న బొమ్మలను, మనసుపడే బొమ్మలను ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణమున్న బొమ్మలను వే(చే)స్తాడన్నమాట అబ్బోఁ… అంటే… ఇకనుంచి భూమీద పుట్టే మనుషులంతా తెగ అందంగా పుట్టేసి ‘‘్భమీద సుఖపడితే తప్పులేదురా… బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా’’ అని పాడేస్తారన్నమాట! ఇలాంటలాంటి అగ్రిమెంట్‌తో దేముడి దగ్గరికెళ్ళిన సత్తిరాజు ఆదివారం (ఆగస్ట్ 31) సోమవారం (సెప్టెంబర్ 1) దేముడి దగ్గర హాజరేయించుకొని, ఆ రోజంతా భవిష్యత్ కార్యాచరణ గురించి తెగ చర్చించేసి… ఆయన పెర్మీషన్‌తో తన ‘‘అర్థప్రాణం’’ అయిన ముళ్ళపూడి ఎంకటరమణ దగ్గరికి పరిగెత్తాడు! ఇద్దరు కావులించుకున్నారు! ముద్దులెట్టేసుకున్నారు! ఏడ్చేసుకున్నారు! ఒకరి చేతులతో ఒకరు కన్నీళ్ళను తుడిచేసుకున్నారు.! ‘‘స్నేహమేరా జీవితం- స్నేహమేరా శాశ్వితం’’అని పాడుకున్నారు- స్వర్గలోకాన్ని చూపిస్త పదా అని రమణ చెప్పగానే ఆయనతో కలిసి చెట్టాపట్టాలేసుకొని స్వర్గంలోని ఆ మూలనుంచి ఈ మూలవరకు కాళ్ళు అరిగేలా తిరగడం మొదలెట్టేశారు! అలా..అలా… తిరుగుతుండగా అక్కడో చెట్టుకింద ఓ బ్యాచ్ కూర్చొని ఓ చిన్నపాటి మీటింగు పెట్టుకోవడం కనిపించింది.! ఏమిటా అని చూశారు ఆళ్ళిద్దరు! అది సత్తిరాజు గురించిన చర్చే అని అర్థమయిపోయింది! అక్కడ చర్చిస్తున్నోళ్ళంతా అట్టాంటిట్టాంటోళ్ళు కాదు! శ్రీశ్రీ.. చలం… దాశరథి… కాళోజీ… చెరబండరాజు… ఆరుద్ర… సురవరం ప్రతాపరెడ్డి.. గూడవల్లి రామబ్రహ్మం… గుర్రం జాషువా… గురజాడ మున్నగు ఎన్నదగువారే సుమీ..! ఇంకా ఢంకా బజాయించి చెప్పాలంటే వాళ్ళంతా అభ్యుదయ కాముకులు… విప్లవ గాముకులు…! ఆ దిగ్గజాలంతా కిందా పైనబడి, వాదోపవాదాలు చేసుకొని, కళ్ళ కాగడాలతో, మనసు భూతద్దాలతో సత్తిరాజు సినిమాలను పరిశీలించి, పరిశోధించి చివరాఖరికి సత్తిరాజును ఓ విప్లవిస్టు… ఓ ఫెమినిస్టు అని తేల్చేశారు..! అదేమిటని ఆశ్చర్యార్థకాలై పోకండేం… ఒక్కో అంశాన్ని, ఒక్కోక్కళ్ళు ఒక్కో కోణంలో చూస్తారు! ఒక్కో కోణంలో అర్థంచేసుకుంటారు! ఒక్కో కోణంలో విశే్లషిస్తారు.! అదంతే.. అక్కడ శ్రీశ్రీ, చలం వగైరాలు చేసింది కూడా అంతే సుమీ- చచ్చి స్వర్గలోకానికి వెళ్ళనప్పటికీ బాపు, రమణల్లో చిన్నప్పటి కామెడీ టింట్ సావలేదు! కొంటెతనం కొండెక్కలేదు! చిలిపితనం, అల్లరి అయిడియాలజీ టపా కట్టలేదు! కార్టూన్ లేసిన కామెడీ బుద్దికదా? అందుకే తమ ముఖాలమీద తుండు గుడ్డలేసుకొని తమను ఎవరూ గుర్తుపట్టరనే కాన్‌ఫీడెన్సు కలిగాక చిన్నగావెళ్ళి ఆ మీటింగు గుంపులో కూసుండిపోనారు- సరిగ్గా అప్పుడే శ్రీశ్రీగోరు తన వాదనను మీటింగులా దంచేస్తుంటే బాపు రమణలు బిత్తరపోయి చూస్తూ వింటున్నారు- శ్రీశ్రీగోరు ఏటంటున్నారంటేఁ… సత్తిరాజు తొట్టతొలి సినిమా ‘‘సాక్షి’’ని ప్రజల మధ్య తీసిండు! పల్లెటూర్లో తీసిండు! పల్లె అందాలతో సినిమా రీళ్ళను నింపేసిండు! పల్లెటూరి జనాల నైజాలను, నిజాలను, తత్వాలను, మనస్తత్వాలను, వ్యక్తిత్వాలను వెండితెరపై ఆరబోసిండు! సినిమా దగ్గరికి ప్రజలు కాదు ప్రజల దగ్గరికి సినిమా వెళ్ళాలనే సిద్ధాంతంతో సినిమా షూటింగ్‌లను ప్రజల దగ్గరికెళ్ళి తీస్తే, యిది మా సినిమా అనుకున్న ప్రజలు సినిమా హాళ్ళదగ్గరికి పొలోమని పరిగెత్తి ‘‘ఓరి సుబ్బిగో… ఓసి రత్తాలో యిది మన సిన్మానే’’ అని ఎలుగెత్తి చాటారు-! ‘‘బుద్ధిమంతుడు’’ సినిమాలో అక్కినేనితో రెండు పాత్రలు చేయించి ఒకరిని ఆస్తికుడిగా, మరొకరిని నాస్తికుడిగా చూపించినప్పటికీ చివరాఖరికి ప్రజలకోసం పోరాడేవాడు, సమాజంలో అవినీతి, అక్రమాలపై దండోరా మ్రోగించినోడు నాస్తికుడైనా దేవుడు అతనే్న యిష్టపడతాడని’’- డప్పు కొట్టినట్లు చెప్పాడు మన సత్తారాజు! ‘‘గుళ్ళో ఏముంది బళ్ళోనే వుంది’’అనే పాటలో గుడి మనిషిని మారుస్తుందో లేదో చెప్పలేము కాని బడి మాత్రం సమస్త మానవజాతిని మారుస్తుందని గొంతెత్తి ఉద్ఘాటించాడు-! ‘‘అందాల రాముడు’’ చిత్రంలో పేద, ధనిక తారతమ్యాలపై, సనాతనాల బూజుపై, కులం మతం రివాజుపై, పురాణ నమ్మకాలపై తుఫాను రేపే సంభాషణలను వీలుదొరికిన చోట్లల్లా మొట్టికాయల్లా వేశాడు! ‘‘రాముడేమన్నాడు… సీతారాముడేమన్నాడోయ్‌ఁ…’’ అనే పాటలో ‘‘మనుషుల్లారా మాయామర్మం వద్దన్నాడోయ్‌ఁ..!’’అంటూ తనదైన సౌమ్య బాటలోనే సామ్యవాదాన్ని వినిపించాడు! ‘‘పెరగడానికెందుకురా తొందరా’’అనే పాటలో భావిభారత పౌరులైన విద్యార్థులను బానిసలుగా, బావిలోని కప్పలుగా మారుస్తున్న మెకాలే విద్యావిధానంపై, విద్యావ్యాపారంపై తిరుగుబాటును సెటైర్ల రూపంలో సంధించాడు. రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన ‘‘ముత్యాల ముగ్గు’’చిత్రంలో నాటి రామాయణ కాలంనుంచి నేటి భారతంవరకు మనుధర్మశాస్త్రాన్ని మనసావాచా ఆచరించే మగజాతి స్ర్తిజాతిని ఎలా అవమానాలపాలు, ఆవేదనల పాలు చేస్తుందో, ఎలా కించపరుస్తుందో, ఎలా అణచివేస్తుందో చూపించి తన స్ర్తి పక్షపాతాన్ని ప్రదర్శించాడు! ప్రఖ్యాత సాహితీ దిగ్గజం ‘‘గుంటూరు శేషేంద్రశర్మ’’ ఒకేఒక్క సినిమాలో పాట రాశారు! ఆ సినిమా ‘‘ముత్యాలముగ్గు’’! ఆ పాట ‘‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది- కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది’’..! ఈ పాట ఆపాత మధురంలా సినీ సంగీత జగత్తులో నిలిచిపోయింది! భారతాన్ని సాంఘీకరించినట్లు రూపొందించిన ‘‘మనవూరి పాండవులు’’ చిత్రాన్ని దేశానికి పట్టుగొమ్మలైన గ్రామసీమలను రాక్షస రాబందులై దోచుకుంటున్న రాజకీయ నాయకులపై దగాపడ్డ గుండెలు ఎగరేసిన తిరుగుబాటు జెండాలా రూపొందించారు. ఎత్తిన పిడికిళ్లను పైకెత్తిన జెండాలుగా మార్చుకొని, ఎలుగెత్తిన కంఠాలను నినదించిన శంఖాలుగా పూరిస్తూ ఊరుఊరంతా ఒక్కటై, ఉమ్మడిగా ఊరేగింపుగా రాక్షస రాజకీయ గుంపును తరిమిగొట్టడం రుూ చిత్ర క్లైమాక్స్! ఈ చిత్రాన్ని ‘‘ఆర్.నారాయణమూర్తి’’లాంటి వాడు తీసి వుంటే అది ఎర్ర సినిమా అయ్యేది! అందుకేనేమో యిటువంటి క్లైమాక్స్‌లు ఆ తర్వాత వచ్చిన అనేక విప్లవ చిత్రాలలో చర్వితచరణంలా అగుపించాయి-! ‘‘తూర్పువెళ్ళే రైలు’’ కథాంశం కూడా కనిపించీ కనబడకుండా పోరు పట్టాలపైనే నడుస్తుంది. తూర్పు అనేది చీకట్లను తరిమేసే స్థానం! మార్పునుమోసుకొచ్చే స్థానం! ప్రపంచంలో తూర్పుదిక్కునే తొలి విప్లవ రాజ్యం ఏర్పడింది! ఈ చిత్రంలో కథానాయిక తన చీకటి బతుకులో వెలుగురేఖలను వెదుక్కుంటూ, తూర్పును వెదుక్కుంటూ ప్రస్థానమవుతుంది! ఇక్కడ తూర్పు అనేది మార్పు కు, తిరుగుబాటుకు చిహ్నం..! అలాగే ధూర్జటి ‘‘శ్రీ కాళహస్తి మహత్యం’’ కావ్యానికి వెండితెఠ రూపం యిస్తూ సత్తిరాజు రూపొందించిన ‘‘్భక్తకన్నప్ప’’లో భక్తిరసంతోపాటు అంతర్లీనంగా కొండజాతి గిరిజనుల బతుకుపోరు కూడా తొంగి చూస్తూ ‘‘కండ గెలిచింది…’’ పాటలో స్పష్టంగా తెలిసొస్తుంది. ‘మిష్టర్ పెళ్ళాం, ‘పెళ్ళిపుస్తకం’, ‘గోరంత దీపం’, ‘వంశవృక్షం’, ‘రాధాకళ్యాణం’ చిత్రాలలో బాపు అనే సత్తిరాజు కెమెరా ఆడవారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులను గురించే చర్చించింది! అక్కడక్కడ అప్పుడప్పుడు ఫెమినిజాన్ని బలపరుస్తూ పురుష దురహంకార వ్యవస్థపై మొట్టికాయలు వేసింది- ఇదిగో… ఇటువంటి కొత్త కోణంతో మనం సత్తిరాజును పరిశీలిస్తే పైకి సాంప్రదాయవాదిగా కనిపిస్తున్న సత్తిరాజులో మనకు ఓ విప్లవిస్టు కనిపిస్తాడు… ఓ ఫెమినిస్టు కనిపిస్తాడు- అంటూ తన ఉపన్యాసం ముగించాడు శ్రీశ్రీ బిగించిన పిడికిలిని విప్పకుండానే–! గుంపులో కలిసిపోయి కూర్చొని వున్న బాపు రమణలు ఆ మీటింగు విని బిక్కమొఖాలు వేసుకొని ఒకరినొకరు చూసుకున్నారు! ‘‘ఏంటేంటి… నేను విప్లవిస్టునా’’అని అడిగాడు సత్తిరాజు రమణను- ‘‘ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళననుకోని! నా దృష్టిలో మాత్రం నువ్వో హ్యూమనిస్టువి’’- అన్నాడు రమణ… అదేనండి ముళ్ళపూడి రమణ! ముళ్ళపూడి రమణ అంటే మన సత్తిరాజు దోస్తు… సత్తిరాజు అంటే… అబ్బా…మీకు మళ్ళీ డౌటొచ్చిందా? అదేనండి… సత్తిరాజు అంటే.. ఆకాశంలో సూరీడు మర్డర్ చేసినట్లున్నాడని గుర్తించినోడు… ముత్యమంత ముగ్గు.. ముఖమెంతో ఛాయ అని కూనిరాగం తీసినోడు… బుడుగుని… సీగాన పెసూనాంబని… రెండుజెళ్ళసీతని… లావుపాటి పిన్నిగారిని… బక్కపలుసు బాబాయిగారిని మనకు పరిచయం చేసినవోడు- గోదావరి అందాలలో తన కుంచెను ముంచి ఆ పన్నీటి జల్లును మనపై చల్లినవాడు- మన తెలుగు సంతకం… మన తెలుగు చిత్తరువు… మన తెలుగు సినిమా… మన చిరంజీవి… బాపు-!

 

Leave a Reply

%d bloggers like this: