సెప్టెంబర్ 12, 2014
ఉన్నవారికే అన్ని సుఖాలూ….
దేశానికి ప్రపంచంలో పేరు తెస్తారు క్రీడాకారులు. అలా పేరు తెచ్చినవారికి అవసరానికి మించి కోట్లకు కోట్లు కానుకగా ఇవ్వడం సంపన్న దేశాలకు తగును. దేశానికి తిండి పెట్టే అన్నదాతలు ఋణ భారాలతో, ఆకలి బాధతో విలవిలలాడే పేద దేశాలు కూడా కోట్లకు కోట్లు ఇచ్చి వారిని సత్కరించాలనుకోవడం అభినందనీయమే! ఎటొచ్చీ వారిని సత్కరించడంలో వేగం, అన్నదాతల్ని ఆదుకోవడంలో జాప్యం పేద దేశాలకు తగునా? 2011లో క్రికెట్లో ప్రపంచ కప్ నెగ్గిన మన జట్టులోని ప్రతి సభ్యుడికీ అప్పటి ప్రభుత్వం అదనంగా కోటి రూపాయలు కానుకగా ప్రకటించినప్పుడు- అక్షరజాలం స్పందన ఇది. ఎందుకంటే ఒక కోటితో వందమంది రైతులకు లక్ష రూపాయల ఋణమాఫీ చెయ్యవచ్చు.
అమెరికా ఓపెన్ టెన్నిస్ పోటీలో దేశం తరఫున కాకపోయినా వ్యక్తిగతంగా పాల్గొని మిక్సెడ్ డబల్సులో ఛాంపియన్షిప్ గెల్చుకుని 75వేల డాలర్ల ప్రైజ్ మనీ స్వంతం చేసుకున్న భారతీయ వనిత సానియా మీర్జా మన దేశానికి గర్వకారణం. ఆమెకు హృదయపూర్వక అభినందనలు. తాత్సారం లేకుండా ఆమెను తక్షణమే అదనపు నగదుతో సత్కరించిన ప్రభుత్వానికీ అభినందనలు. ఈ సత్కారం ఫలితంగా తమ విషయంలోనూ ఇదేవిధంగా తాత్సారం లేకుండా నిర్ణయాలు జరుగుతాయని అన్నదాతల్లో ఆశ మొలయింది. వారికి శుభాకాంక్షలు.
ఆంధ్రజ్యోతి
Sarma Kanchibhotla said,
సెప్టెంబర్ 13, 2014 at 12:30 ఉద.
గోపీకిస్తే గొప్పేముంది
లక్ష్మణ్ కు ఇస్తే లక్ష్యమేముందీ
సోనియా కు ఇస్తే మిత్రత్వం గట్టి పడుతుంది.
హేమా! పేరులోనే ఉన్నదిగా పెన్నిధి అనేమోనమ్మా!
నీ విజయానికి మా అభినందనలు, ఇంతకంటే ఆశించకమ్మా !
ఉన్నది కూడా పోయేను!
Sai Kumar said,
సెప్టెంబర్ 12, 2014 at 8:15 సా.
What is this publicity stunt at the cost of tax paying public? Did Sania represent the country in US open. The person who represented the country gets a promise which has no value and the media never follows ithat news as does not increase their readership or TPR. Mr. kCR, should remember that it is not his personal ” jagirdar” from which he had given a Crore but the public money.
Sarma Kanchibhotla said,
సెప్టెంబర్ 13, 2014 at 11:33 సా.
అంతర్జాతీయ క్రీడాకారిణి, అందునా స్త్రీ, మరియు అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వ్యక్తి, ముఖ్యమంతికి కృతజ్ఞతలు చెప్పితే ప్రజలందరికి చెప్పినట్లేట ! వ్యక్తిగత హోదాలో ఆడినా తెలంగాణా ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పినట్లుట. ముఖ్యమంత్రిగారు చెప్పారంటే తిరుగులేదు !