సెప్టెంబర్ 28, 2014

జాషువా – తెలుగు

Posted in భాషానందం at 8:53 సా. by వసుంధర

అసామాన్యుడైన జాషువా గొప్పతనాన్ని కొలవడానికి చాలామంది ఆయన వాడిన సామాన్యుల భాషని నిదర్శనంగా చెబుతారు. ఆ అభిప్రాయంతో మేము పూర్తిగా ఏకీభవించలేము. జాషువా భాష పూర్తిగా సామాన్యులది అనలేము. సామాన్యులు సామాన్యుల భాషకే పట్టం కడతారనుకోవడమూ పొరపాటే. అందుకు బహుళ ప్రాచుర్యం పొందిన మయసభ ఏకపాత్రాభినయం ఒక ఉదాహరణ. దానవీరశూర కర్ణలో ఎన్టీఆర్ డైలాగ్స్ మరో ఉదాహరణ. ఇక జాషువా భాష జంధ్యాల పాపయ్యశాస్త్రికంటే సరళం అనడం కష్టం. జాషువా గొప్పతనం ఆయన కవిత్వంలో ఉంది. కులం, దళితం వగైరా రాటలకు కట్టకుండా మహాకవులను అభిమానించడం రసహృదయులకు ఉచితం. రామభక్తుడైన బాపు- రామాయణ విషవృక్షానికి బొమ్మ వెయ్యడంలో రసహృదయ స్పందనే తప్ప ఇజాల రొద లేదు. ఈ విషయాలు గుర్తుంచుకుంటే నేడు ఆమ్ధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం అభినందనీయం.

jashuva

Leave a Reply

%d bloggers like this: