సెప్టెంబర్ 30, 2014
బతుకమ్మ స్పందనలు
పండుగ చేసుకున్నప్పుడు ఆనందంగా చేసుకోవాలి. మేము ఒరిస్సానుంచి ఇక్కదొకొచ్చిన ఈ పదేళల్లోనూ బతుకమ్మ పండుగ వేడుకల గురించి ఏటా విని ఆనందించేవాళ్లం. ఈ ఏడాది ఆ వేడుకలు మరింత బాగా జరిగితే అది కొత్త రాష్ట్రం వచ్చిన ఆనందం అని సంబరపడాలి. మధ్యలో ఆంధ్రోళ్ల ప్రసక్తి తేవడంవల్ల అందులో వేడుకకంటే ద్వేషమే ఎక్కువవుతుందని- ఆ ప్రసక్తి తెచ్చినవారు గ్రహించాలి. కొత్త రాష్ట్రం వచ్చింది. పండుగలు కొత్తగా జరుపుకుంటున్నాం. ఇంతకీ ఒకే భాష మాట్లాడే మనం- మనం మనం ఒకటి కాదు, వేరని నమ్మించుకుందుకు ప్రయత్నించడంవల్ల సాధించేదేమీ లేదు. గతంలో తప్పులు జరిగితే- ఆ తప్పులు దిద్దుకునే ప్రయత్నంలో ఎవరినో తప్పు పట్టడం రాజకీయమౌతుంది తప్ప ప్రగతి కానేరదు. గతాన్ని వెనక్కి నెడుతూ, మనం భారతీయులమన్న భావనకు ప్రాధాన్యమిస్తూ, పదండి ముందుకు!
మనకు న్యూయార్కు, సింగపూరు మోడల్స్ అంటూ రోజూ వింటున్నాం. బతుకమ్మ పండుగకి మహిళలకి కొన్ని రోజులపాటు మధ్యాహ్నాలు సెలవు ప్రకటించినట్లూ విన్నాం. ఆయా దేశాల్లో మామూలు సెలవులే మనకంటే చాలా చాలా తక్కువ. మరి ఇలా అదనపు సెలవుల ఐడియా ఎక్కడిదో. ఏ పండుగైనా ప్రభుత్వంనుంచి జీతం తీసుకుని జరుపుకోవడం ప్రగతి నిరోధకమని తొందరగా గ్రహించకపోతే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ఇతర పండుగలు, బతుకమ్మపై నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ స్పందన్లు ఆసక్తికరం.
Leave a Reply