Site icon వసుంధర అక్షరజాలం

కథా రచయితలకు దారేది?

story wtiters 1

సహాయంలేకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మొత్తం తానొక్కడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాలకి రచయితలకి పనిలేకుండాపోతుంది. అందుకే రచయితలు దర్శకులుగా మారుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వక్కంతం వంశీ లాంటివారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. రచయిత దర్శకుడి యుద్ధానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. విజయభాస్కర్- త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీనువైట్ల-కోనవెంకట్ ఆ గొడవలు ప్రక్కనపెడితే ఈ కాలంలో వస్తున్న సినిమా రచయితలు కొంతమంది ఎక్కువ సినిమాలు రచిస్తున్నారు. వాళ్లు గోపీమోహన్, కోన వెంకట్, వక్కంతం వంశీ, ఆకుల శివ లాంటి పేరు గత ఐదు ఆరు సంవత్సరాలనుండే తప్పా మిగతా పేరు అసలు కనిపించదు. దర్శకులు కూడా వాళ్లని ఎంచుకుంటున్నారు. హిట్ట్ఫాట్టా అనే బేధం అనవసరం. అలాంటి రచయతలు రాస్తే గొప్ప ఓపెనింగ్స్ వస్తాయని ఆలోచన ఒక్కటే చాలామంది దర్శకుల్లో ఉంది. ‘నిర్మాతలు కొత్త కథలు కావలసినప్పుడు, నిర్మాతలే రచయితలు దగ్గరకు వెళ్లాలి. ప్రతి జిల్లాలో కొన్ని కార్యక్రమాలుపెట్టి రచయితలు దగ్గర కథలు వింటే గొప్ప కథలు రావచ్చు.’ ఈ ప్రయోగం నిర్మాతలకు నచ్చకపోవచ్చు కాని ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే హీరోలు తమకు నచ్చే కథ కావాలంటే రచయితలను పిలిపించి వాళ్లకి అవకావం కలిగించాలి. డాన్సర్స్‌కోసం, గాయనీగాయకులకోసం ఎలాఅయితే కార్యక్రమాలు చేపడుతున్నారో రచయితలుకోసం ఈ ప్రయోగం చాలా అవసరం. ఎందుకంటే తెలుగు పరిశ్రమ భారతదేశంలో రెండో అతి పెద్ద చిత్ర పరిశ్రమగా ఉంది. తెలుగు పరిశ్రమలో మార్పు చాలా అవసరం. రచయితలకు సరైన దారిలేకపోవడంవలన ఏవైనా చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ వారిలో ఉండే టాలెంట్‌ను చంపేసుకుంటున్నారు. ‘‘మాయ చేసి చిత్ర పరిశ్రమకన్నా, ఉపాధి అందించే ఉద్యోగం మిన్నా’’ అన్నట్లు ఎంతోమంది అనుకుని పరిశ్రమకు దూరం అవుతున్నారు. అందుకే తెలుగు పరిశ్రమ ఆలోచించి రచయితలు దగ్గర ఉండి కథలు వినేలా ఏవైనా అవకాశాలు కల్పిస్తే తెలుగు పరిశ్రమ కళకళలాడుతుంది. లేదంటే మన పరిశ్రమ ఎప్పటికీ మారదు. కొత్త కథలు రావు. కొత్త కథా రచయితలు రారు. ఇలాంటి ప్రయోగం చేసేలా ఒక నిర్మాతనే ఆలోచించాలి. దర్శకులూ ప్రోత్సహించాలి.             

నల్లపాటి సురేంద్ర

ఆంధ్రభూమి దినపత్రిక (అక్టోబర్ 3, 2014)

 

Exit mobile version