అక్టోబర్ 7, 2014
పూరి జగన్నాథ్- చందమామ కథ
ఫిబ్రవరి 1 (2014) సాక్షి దినపత్రికలో పూరి జగన్నాథ్‌తో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆయన తనను చందమామ మాసపత్రిక చాలా ప్రభావితం చేసిందని చెబుతూ మచ్చుకి ఓ కథ చెప్పారు. ఆ కథారచయిత పేరు ఆయనకి గుర్తు లేదు. ఆ కథ వ్రాసిన రాంబాబు నా చిట్టితమ్ముడు. పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రామారావు. ఈ కథ వ్రాసినప్పుడు భువనేశ్వర్‌లో మాతో మా ఇంట్లోనే ఉండేవాడు. కథాకాలం 1978-80. అతడు ఇటీవలే Industrial Development Bank of India నుంచి ఉన్నత పదవిలో రిటైరయ్యాడు. అతడి కథ ఓ ప్రముఖ యువ దర్శకుణ్ణి ప్రభావితం చేసిందన్న మాట నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అతడినుంచి ఇటీవలే ఆ కథను సంపాదించాను. ఆ ఇంటర్వ్యూ, ఆ కథ అక్షరజాలం వీక్షకుల ప్రయోజనార్థం ఇక్కడ ఇస్తున్నాం.
nagudatta said,
డిసెంబర్ 9, 2014 at 9:48 సా.
Reblogged this on nagudatta and commented:
Very interesting
Sivakumara Sarma said,
అక్టోబర్ 8, 2014 at 3:43 సా.
జగన్నాథ్ గారు చెప్పిన దానికి చిన్న సవరణ – “రామాయణ కల్పవృక్షం” రాసింది శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రంగనాయకమ్మగారు రాసింది “రామాయణ విషవృక్షం”