అక్టోబర్ 13, 2014
తెలుగు నుడికారానికి తెలంగాణం
తెలుగునాట అన్ని ప్రాంతాలవారూ వాడే- తిప్పలు, సొత్తు, ముత్తెమంత- వంటి పదాలు తెలంగాణ మాండలికమని నాకు తెలియదు. ప్రాంతీయత పాఠ్యాంశాల భాషలో చొరబడడం అవసరం. కానీ తెలంగాణ భాషను కూడా తెలుగునుంచి విడదీసి చూడడం మంచి ప్రయత్నం అనిపించదు. కొన్నిశతాబ్దాలక్రితం పోతన, కొన్ని దశాబ్దాల క్రితం దాశరథి, నేటి సినారె- పుట్టుకనుబట్టి మాత్రమే తెలంగాణ వారు. వారి కవితలు అన్ని ప్రాంతాలవారికీ అర్థమయ్యే తెలుగులోనే వ్రాయబడ్డాయి. తెలుగు, తెలంగాణ ఒకటేనని వారు కలిగించిన అభిప్రాయాన్ని అలాగే ఉండనివ్వండి. ఏ రష్ట్రంలోనైనా స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వడం తగిన పని. అది కూడా మనం భారతంలో ఒక భాగమని గుర్తిస్తూ. ఆ ప్రాధాన్యం అంతవరకేనని స్వాభిప్రాయం. ఐతే నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసంలో సానుకూలమైన అంశాలే ఎక్కువునాయి.
Sarma Kanchibhotla said,
అక్టోబర్ 13, 2014 at 11:26 సా.
మాండలీకమేదైనా తెలుగు బ్రతికితే చాలు జీవుడా ! ఆ నిష్పత్తులు కూడ ఎందుకండీ ? నూరు శాతం తెలంగాన్యం ఎందుకు చేయరు? కల్వగుంట్లవారు ఆలోచించాలి.