అక్టోబర్ 13, 2014

మానవుడే బలహీనుడు

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:52 సా. by వసుంధర

మనిషి గొప్పతనాన్ని కీర్తిస్తూ మహాకవులు ఎన్ని కవితలైనా చెప్పొచ్చు. ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకున్నాకూడా- ప్రకృతిముందు మనిషి బలహీనుడే! ఈ విషయం మాకు స్వానుభవానికి వచ్చిన సంఘటనల్లో భువనేశ్వర్లో రీజినల్ రీసెర్చి లాబరేటరీ కాలనీలో 1999 అక్టోబర్ 29నాటి సూపర్ సైక్లోన్ ముఖ్యమైనది. ఉదయం 9కి ఆఫీసుకి వెళ్లేసరికే గాలి ప్రచండంగా ఉంది. ఆ తర్వాత ఆఫీసునుంచి చూస్తే చుట్టూ ఉన్న పొడవాటి అశోక వృక్షాలు వంగి నేలను తాకుతున్నాయి. మా ఇంటికీ ఆఫీసుకీ కేవలం పది నిముషాల నడక దూరం. కానీ మధ్యాహ్నం లంచికి వెళ్లలేకపోయాం. కరెంటు పోయింది. నీళ్లు రావడం లేదు. కబురు చెప్పడానికి ఫోన్లు పనిచెయ్యడం లేదు. రాత్రి ఎనిమిది వరకూ ఆఫీసులోనే ఉండిపోయి, ఇక లాభం లేదని నలుగురు మిత్రులం కలిసి ఇళ్లకు బయల్దేరాం. దారి పొడుగునా చెట్ల కొమ్మలు, కరెంటు తీగలు, నీళ్లు, బురద. ఇంటిముందుకు చేరడానికి సుమారు గంట పట్టింది. ఇంటిముందు సుమారు నలబై ఏళ్లుగా ఎన్నో పక్షులకి నివాసస్థానంగా ఉంటున్నమహా వటవృక్షం కూకటి వ్రేళ్లతో లేచిపోయి గేటుకి అడ్దంగా పడి ఉంది. అప్పుడున్న ప్రళయ భీకర నాదంలో నా పిలుపు ఇంట్లోకి చేరేలా లేదు. ఆ కొమ్మల్ని తప్పించుకుంటూ ఇంటి గుమ్మాన్ని చేరుకుందుకు సుమారు అరగంట పట్టింది. ఆ తర్వాత నేను, నా భార్య ఒకరికొకరుగా ఆ రాత్రంతా బితుకుబితుకుమంటూ గడిపాం. ఆ తర్వాత కొన్ని రోజులు పగలు తిండి, నీళ్ళు కోసమూ- రాత్త్రిళ్లు వెలుగు కోసమూ మేము పడిన తిప్పలు చెప్పడానికి మాటలు చాలవు. మాది రీసెర్చి లాబరేటరీ కాబట్టి ఊళ్లో అందరికంటే త్వరగా అన్ని సదుపాయాలూ అమిరాయి. ఊళ్లోని పేదలకు ఆరయం, చాలామందికి నీళ్లు ఇచ్చాం.

విశాఖలో హుద్ హుద్ తుఫాను సృష్టించిన భీబత్సం గురించి విన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చి విశాఖ వాసులకు కలిగిన ఉపద్రవం కళ్లకు కట్టి వళ్లంతా వణుకు పుట్టింది. ఈ క్రింది వార్త, చిత్రాలు అందులో కొంత నిజాన్నే మనకు అందజేస్తాయి. ముందుగా తెలిసి కూడా ఈ ఉపద్రవాన్ని తప్పించుకోలేని మనిషి తానెంత సామాన్యుడో గుర్తిస్తే- మన సమాజంలో సామాన్యులకి ఎన్ని ఉపద్రవాలొచ్చినా ఇక్కట్లు ఉండవు. ప్రస్తుతానికి మన సమాజంలో నాయకులు మాత్రమే మనుషులుగా చెలామణీ అవుతున్నారు మరి….

HudHud-Nasa-m

This October 12, 2014, satellite image from NASA shows Cyclone Hudhud over India. Pic/AFP

లంకె

cyclone visakha
                              Times of India  Link

 

cyclone visakha 1

ఈనాడు

1 వ్యాఖ్య »

  1. ప్రకృతిని ఆరాధించిన ఫలితం ఆంధ్ర మహా భాగతం దశమ స్కందములోని గోవర్ధనోధ్ధరణ చదివితే తెలుస్తుంది. ప్రకృతికి వికృతి చేయుచున్నందునే ఈ విలయాలు, ప్రళయాలు. బాధితులకు నా ప్రగాఢ సహాయ సానుభూతి.


Leave a Reply

%d bloggers like this: