అక్టోబర్ 17, 2014

ముఖ్యం కంటే ప్రధానం గొప్పది

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:49 సా. by వసుంధర

నేడు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదివేముందు ఇప్పుడే అందిన వార్త. సుప్రీం కోర్ట్ జయలలిత జైలు శిక్షను నిలుపు చేసింది. ఆమెకు బెయిలు ఇచ్చింది. గతంలో అలహాబాద్ కోర్టు ఇందిరను ఆరేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనరాదని శాసించింది. ఆ శాసనాన్ని ధిక్కరించి ఎమర్జెన్సీ విధించిన ఆమెకు ప్రజలు మూడేళ్లలో మళ్లీ పట్టం కట్టారు. ఆమె నాయకత్వం వహించిన పార్టీకి దశాబ్దాలపాటు కొమ్ము కాసినవారిలో మన తెలుగువారు అగ్రగణ్యులు. ఆమె వారసుల ఆధిపత్యంలో ఆ పార్టీ యావద్భారతాన్ని ఇటీవల 2004-14లలో పదేళ్లు పాలించింది. అందుకేనేమో జయలలిత భారత ప్రధాని కావాలని మహా మనసు పడింది. ఐనా ప్రధానమంత్రికో న్యాయమూ, ముఖ్యమంత్రికో న్యాయమూనా? ఇదేనా మన ప్రజాస్వామ్య వ్యవస్థ?

aviniti

Leave a Reply

%d bloggers like this: