అక్టోబర్ 19, 2014

విమలక్క పాట

Posted in కళారంగం at 6:06 సా. by వసుంధర

ఉద్యమాలనుంచి కవిత్వంతోపాటు ఎన్నో కళలు ఆవిర్భవిస్తాయి. ఉద్యమాలు ఎన్నో కళల్ని ఆలంబన చేసుకుంటాయి. ఉద్యమకారుల అబిప్రాయాలు ఏకపక్షంగా ఉంటాయి. అలా లేకుంటే వారిలో ఉద్యమాన్ని కొనసాగించే ఆవేశం ఉండదు. ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణలో మన దేశపు ఉద్యమకారుల సానుభూతి ఏకపక్షంగా పాలస్తీనామీదనే ఉంటున్నది. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లన్న విషయాన్ని వారు ఏమాత్రం అంగీకరించరు. అలాగే ఇజ్రాయిల్ సాహసాన్ని అదేపనిగా పొగిడేవారూ అల్పంగా ఉన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణపై విమలక్క ప్రదర్శించిన నృత్యగేయాన్ని టివి 5 అందించింది. ఈ కార్యక్రమంలో  విమలక్క ఎంతో అందంగా హుందాగా ఉంది. అమె గొంతు, పాట హృద్యంగా ఉన్నాయి. తను నమ్మిన విషయంపట్ల అవేదన, అంకితభావం ఆమె కళ్లలో సుస్పష్టమౌతుంది. అమె బృందం చేసిన నృత్యం సొగసుగా, హుందాగా ఉంది. మొత్తంమీద ఈ ప్రదర్శన గొప్పగా అనిపించింది. భావజాలంతో నిమిత్తం లేకుండా ఆనందించతగ్గ ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: