అక్టోబర్ 20, 2014

ప్రాచ్యమా అప్రాచ్యమా?

Posted in భాషానందం at 9:31 సా. by వసుంధర

అక్టోబర్ 16 ఆంధ్రభూమిలో సంస్కృతభాష ప్రాధాన్యాన్ని వివరిస్తూ వచ్చిన వ్యాసాన్ని ప్రాచ్యమా అప్రాచ్యమా అన్న మకుటంతో అక్షరజాలంలో అందజేశాం. ఐతే వేదాల్నీ, మనుస్మృతినీ, కులవ్యవస్థనీ తలచుకుని సంస్కృతంపట్ల ద్వేషాన్ని పెంచుకున్నవారు చాలామంది ఉన్నారు మన దేశంలో.   వారి దృక్కోణాన్ని ప్రతిఫలిస్తూ నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వ్యాసాన్ని ఈ క్రింద ఇస్తున్నాం. ఐతే సంస్కృతం కంప్యూటర్‍కి కూడా అనువైన ఒక అత్యాధునిక భాష. ఆ భాషని భాషగానే చూసి, ఆ భాషలో వచ్చిన గ్రంథాల్లో ప్రజాహిత వైజ్ణానిక అంశాలని కూడా గుర్తించడం అవసరం. ఎందుకంటే ప్రపంచ భాషల్లో భాషగా సంస్కృతం విశిష్ఠత గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది లేదు. అదొక అద్భుతమైన భాష. దాన్ని కొందరు వ్యక్తులో, వ్యవస్థలో దురుపయోగం చేసుకుని ఉంటే- ఆ భాషనే నిరసించడం చెరువుమీద అలకలాంటిదవుతుంది. మనని దోపిడి చేసిన బ్రిటిష్ వారి భాషలో తన గీతాంజలిని అనువదించి నోబెల్ బహుమతి పొందిన రవీంద్రుడు- మనకు జాతీయ గీతాన్ని అందించడానికి అర్హుడైనాడన్న విషయం విస్మరించకూడదు. భాషను సంస్కృతితో ముడిపెట్టక- భాషగానే చూసి దానివల్ల ప్రయోజనాలు పొందుదాం.

sanskrit vs english

1 వ్యాఖ్య »

  1. తోకలవారి శిరోవేదన తగ్గినదని తలుస్తాను. ఎవడిగోల వాడిది అని వదిలేస్తే ఇంత అల్లరి ఉండదు.


Leave a Reply

%d bloggers like this: