అక్టోబర్ 23, 2014

రాహుల్ ప్రహసనం

Posted in సాంఘికం-రాజకీయాలు at 6:41 సా. by వసుంధర

తనంటూ సాధించినది పెద్దగా ఏమీ లేకపోయినా-  రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. దానికి జనామోదం లభించింది. ప్రధానమంత్రి ఐనాక కూడా ప్రజలకు గుర్తుంచుకోతగ్గ గొప్ప మేలు ఏదీ చెయ్యకపోయినా, పాలనాప్రతిభను కనబర్చకపోయినా, చివరకు పార్టీని ఎన్నికల్లో కూడా గట్టెంచలేకపోయినా- ఆయన పేరిట ఇప్పటికీ ఎన్నో వీధులు, సంస్థలు, పథకాలు, ప్రణాళికలు నడుస్తున్నాయి. ఆయనకున్న అర్హత నెహ్రూ కుటుంబానికి వారసుడు కావడం. ఈ మాట ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎంకంటే  నెహ్రూ కుటుంబానికి గాంధీ ఇంటిపేరునిచ్చిన ఫిరోజ్ గాంధీ పేరును ఆ కుటుంబంలో ఎవ్వరూ మాట వరుసకైనా స్మరించరు, ప్రస్తావించరు.  ఏదేమైతేనేం ఆ తర్వాత అదే విధంగా సోనియా దేశ రాజకీయాల్లో ప్రముఖమయ్యారు. ఆమె విదేశీవనిత కావడం, తీవ్ర అస్వస్థతకు గురి కావడం, ఆమెకు వయసు మీద పడుతూండడం వల్ల- రాజీవ్, సోనియాల కుమారుడు రాహుల్ గాంధీని- నెహ్రూ వారసుడిగా ప్రధానమంత్రిని చెయ్యాలన్న తాపత్రయం మొదలైంది. కానీ అతడికే తనమీద తనకి నమ్మకం లేదు. నలుగురిలోకి వచ్చినా, మాట్లాడినా- అతడి తీరు అపహాస్యం పాలైంది. దాంతో మొదటిసారిగా- నెహ్రూ కుటుంబపు వారసుడు రచయితల ప్రహసనాలకు నాయకుడైనాడు. అలాంటి ఓ ప్రహసనం నేడు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం.

rahul

Leave a Reply

%d bloggers like this: