నవంబర్ 4, 2014
భువినుండి దివికి
1982లో అర్థసత్య అనే ఓ కళాత్మక చిత్రం చూశాం. కమర్షియల్ చిత్రాలకంటె ఎక్కువగా అలరించిన ఆ చిత్రం బాక్సాఫీసువద్ద కూడా ఘనవిజయం సాధించిందని గుర్తు. అమ్రీష్ పురీ కానిస్టేబులుగా, ఓంపురీ ఇనస్పెక్టరుగా (ఓంపురీ కొడుకుగా) నటించిన ఈ చిత్రంలో సదాశివ్ అమ్రాపుర్కార్ అనే కొత్త నటుడు రామాసెట్టి అనే దాదా పాత్రలో విలన్గా కనిపించి తన విభిన్నమైన నటనతో ప్రేక్షకుల మన్సుపై చెరగని బలమైన ముద్ర వేశాడు. ఓంపురీ అతణ్ణి అరెస్టు చెయ్యడానికి వెళ్లినప్పుడు, ‘ఆజ్ టైమ్ నై, కల్ ఆ’ అనడం ఓ కొత్తదనం. ఆ అన్న తీరు ఊహాతీతం. అలాగే అతడు సడక్ చిత్రంలో మహారాణి అనే నపుంసక పాత్రలో విలన్గా ప్రేక్షకుల్లో వణుకు తెప్పించిన విధం వర్ణనాతీతం. ఆ మహానటుడికి తన 64వ ఏటనే పైనుంచి పిలుపు వచ్చిందిట…
ఆంధ్రభూమి
Leave a Reply