నవంబర్ 6, 2014
మతం-మనం (రచన: వసుంధర)
మతం గతం ప్రజాహితం
మతం హితం స్వయంకృతం
మతం పేరు చెప్పుకుని
మనం మనం భుజం కలిపి
లక్ష్యాలను సాధిస్తే
అదే మతం అభిమతం
మతం పేరు చెప్పుకుని
జనం బలం పెంచుకుని
సమరభీతి తొలగిస్తే
మతం నీకు స్వాగతం
మతం పేరు చెప్పుకుని
మనం మనం కత్తి దూయ
ప్రవహించే నెత్తుటేర్లో
మతం మనం గతం గత:
(ఆంద్రసచిత్ర వారపత్రిక జనవరి 6-7-1984)
ఆంధ్రభూమి
Leave a Reply