నవంబర్ 6, 2014

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:27 సా. by వసుంధర

మన దేశంలో పేదలకూ, శ్రామికులకూ, ఉద్యోగులకూ ఎంతోకొంత న్యాయం జరుగుతున్నదంటే- అందుకు ముఖ్య కారణాల్లో కమ్యూనిస్టు పార్టీలని చెప్పుకోక తప్పదు. అయితే మన కమ్యూనిజంలో చాలా గజిబిజి ఉన్నది. వాటిలో స్పష్టంగా కనబడేవాటిలో హిందూత్వపు వ్యతిరిక్తత ఒకటి. జీవన విధానమైన హిందూత్వాన్నికూడా మత తత్వంగా భావించేవారు- ఎవరైనా తాను హిందువునని చెబితే- వారిని మతతత్వవాదులుగా పరిగణిస్తారు. చిత్రమేమిటంటే వారు ఎన్నడూ ముస్లిములని మతతత్వవాదులుగా అనుకున్నట్లు తోచదు. ముస్లిం పేరున్న ఎంఐఎం పార్టీ- ఇటీవల ముంబై ఎన్నికల్లో రెండు స్థానాల్లో నెగ్గినప్పుడు- మత తత్వ శక్తులు ప్రవేశించాయని గుండెలు బాదుకోలేదు. వారికి శివసేన, బిజెపిలు మాత్రమే మతోన్మాద పార్టీలుగా అనిపిస్తాయి. దేశం మొత్తం బిజెపివైపు మొగ్గినా, ముస్లిం యువత కూడా బిజెపిని నమ్మినా- వారు బిజెపిని మతతత్వ పార్టీగా అనుకుంటారు. ముస్లిములను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే సమాజవాద, కాంగ్రెస్ పార్టీలను- అందుకుగానూ వారు తప్పు పట్టరు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల గురించి మోదీని ఇప్పటికీ తప్పు పడుతూ, ఆ అల్లర్లకు దారితీసిన మూల ఘటనను మాటవరుసకు కూడా ప్రస్తావించరు. మతాన్ని వ్యక్తిగతంగా భావించి, రాజకీయాల్లో మతం పేరు ఎత్తకూడదన్న నియమాన్నివారు విస్మరించి- ఆ నేరాన్ని బిజెపికి అంటగడతారు. వారి మేధో మథనంలో – బిజెపి హిందూ హాలాహలంగా పుట్టి అలాగే ఉండిపోయింది. అమృతం ఇంకా పుట్టవలసి ఉన్నది. మన దేశంలో కమ్యూనిజాన్నిచక్కగా విశ్లేషించిన ఈ క్రింది వ్యాసంలో కూడా- కొన్ని పార్టీలకు మతం రంగు పులిమే ప్రయత్నం  జరిగింది.  అయినప్పటికీ- ఈ వ్యాసం అలోచనాత్మకం, ప్రయోజనాత్మకం.

communism

ఆంధ్రజ్యోతి

 

Leave a Reply

%d bloggers like this: