నవంబర్ 19, 2014
పెళ్లయ్యాక ఆ తర్వాత?!
వివాహాన్ని స్త్రీలకు రక్షణగానూ, పురుషులకు లక్షణంగానూ భావించే సంప్రదాయాన్ని ఎన్నోశతాబ్దాలుగా పాటిస్తున్నాం. ఇప్పుడు రోజులు మారాయి. మహిళలు సాధికారులై- వివాహం కేవలం రక్షణకు కాదనీ, పురుషులకు వలెనే తమకూ దాంపత్య జీవితాన్ని అనుభవించడానికనీ నొక్కి చెబుతున్నారు. వారెంత సాధికారులైనా, మనమెంత ఆధునికులమైనా- ఇప్పటికీ మగువలపై ఆంక్షలు ఎక్కువగానే కొనసాగుతున్నాయి. ఆపైన ఆధునిక జీవన శైలి పురుషులను- దాంపత్య జీవనానికి అనర్హుల్ని చెయ్యగల కొత్త సమస్యకు గురి చేస్తోంది. కానీ కొందరు వివాహం పురుష లక్షణం అనుకుంటూ- ఆ సమస్యను దాచిపెట్టి- పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా మోసపోయిన అమ్మాయిలు- ఆ విషయం బయటపడ్డాక- ఆ పెళ్లినుంచి బయటపడ్డానికి పడిన, పడుతున్న, పడనున్న అవస్థలు మాకు సోదాహరణంగా తెలుసు. అలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండడానికి- ఈ క్రింది వ్యాసంలోని సూచనలు అవశ్యం ఆచరణీయం.
ఆంధ్రభూమి
Leave a Reply