నవంబర్ 25, 2014
రాణి బస్సులో, అంగరక్షకులు కారులో….
సిద్ధార్థుడు కొన్నేళ్లు భార్య యశోధరతో కాపురం చేసి, మానవ జన్మ రహస్యాల్ని తెలుసుకుందుకు తన 29వ ఏట ఇంటినీ, ఇల్లాల్నీ విడిచి వెళ్లాడు. నరేంద్రుడు జశోదను పెళ్లి చేసుకుని, ఆమెతో కాపురం చెయ్యకుండానే, దేశ నిర్మాణానికి తన 18వ ఏట ఇంటినీ, ఇల్లాల్నీ విడిచి పూర్తి స్థాయి రాష్ట్రీయ స్వయంసేవకుడయ్యాడు. సిద్ధార్థుడు రాజరికాన్ని నిరసించి సన్యాసిగా తిరిగి రావడంవల్ల భార్యను శిష్యురాలిగా మాత్రమే స్వీకరించగలిగాడు. నరేంద్రుడు తొలుత రాష్ట్రాధినేతగా తిరిగి వచ్చి, ప్రజారంజకుడిగా పేరు తెచ్చుకుని దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించడంవల్ల – ఆయన భార్య జశోద దేశాధినేత భార్యగా గౌరవార్హులయింది. కానీ అమె ఏమంటోంది? నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ వార్త స్వతంత్ర భారత చరిత్రలో ఒక విడ్డూరం….
Leave a Reply