Site icon వసుంధర అక్షరజాలం

మన భాష మనకే బరువా?

మనది కాని ఇంగ్లీషు భాష నేర్చుకుని విదేశాల్లో విజయాలు సాధిస్తున్నాం. తమదికాని తెలుగు నేర్చుకుని తెలుగునాట సాహితీపరులయ్యారు ఎందరో దేశ విదేశీయులు. తెలుగు మాతృభాషగా ఉన్న తెలుగునాట ఉన్న వారు- తమ యాసను వదిలి ప్రామాణిక తెలుగు భాషను నేర్వలేరుట. అందుకని యాసనే తెలుగు చెయ్యాలంటున్నది నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం. పలు యాసల సమ్మిళితంగా ప్రామాణిక తెలుగు భాషను రూపొందించకపోతే, తెలుగు యాసల పేరిట ముక్కలు ముక్కలైపోతుంది. ప్రామాణిక తెలుగు భాష లేకపోతే- అంతర్జాతీయంగా తెలుగు అంతరించిపోయే ప్రమాదముంది.  అప్పుడు యాసలూ క్రమంగా అంతరించిపోయి- ఏ ఇంగ్లీషో మనకి ప్రామాణికమౌతుంది. ఈ విషయాన్ని ఇటీవల పలమనేరులో జరిగిన తెలుగు కథకుల సదస్సు కూడా గుర్తించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఇక పై వ్యాసం చదవండి.

Exit mobile version