డిసెంబర్ 8, 2014

వివాదం- బాలసాహిత్యం

Posted in సాహితీ సమాచారం at 8:26 సా. by వసుంధర

మన బాల సాహిత్యానికి ఉన్నది మంచి రచయితల కొరత కాదు. మంచి పాఠకుల కొరత. మంచి ఆదరణ కొరత. మంచి  మన విమర్శకుల కొరత కూడా. ఇంతవరకూ వచ్చిన బాల సాహిత్యంలో సైంటిఫిక్, హాస్య రచనలతో సహా అన్ని ప్రక్రియలూ ఉన్నాయి. అవి చాలా కొద్దిమందినే చేరుతున్నాయి. ఇక పంచతంత్రం చదివి జంతువులమీద విసుగు పుడుతోందంటే, అది అవగాహన లోపమే తప్ప పంచతంత్రం లోపం కాదు. తెలుగులో బాల డిటెక్టివ్ లేకపోవడం నిజం. డిటెక్టివులు మన సంస్కృతిలో భాగం కాదు. పాఠకుల ఆదరణ ఉండడంవల్ల పెద్దలకోసం డిటెక్టివ్ రచనలు వచ్చాయి. పత్రికలు ఆదరిస్తే పిల్లలకూ అలాంటివి వస్తాయి. ఈ క్రింది వ్యాసంలో తెలుగులో వచ్చిన మంచి హాస్య, వైజ్ఞానిక, సాంఘిక, జానపద రచనల్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాసం వ్రాసి ఉంటే ఇంకా బాగుండేది. కేవలం ఏంకావాలో వ్రాయడానికి పుస్తకాలు చదవనక్కర్లేదు కదా! ఐతే ఈ క్రింది వ్యాసంలో అలోచనాత్మకమూ, ప్రయోజనాత్మకమూ, రచయితలకు మార్గదర్శకమూ, బాలలకు అత్యవసరమూ అయిన సూచనలెన్నో ఉన్నాయి.  

balasahityam

ఆంధ్రభూమి

 

Leave a Reply

%d bloggers like this: