Site icon వసుంధర అక్షరజాలం

ఇదెక్కడి స్వేచ్ఛ?

పార్లమెంటుపై దాడి చేసినందుకు ఉరితియ్యబడ్డవారిని అమరులంటూ స్మరించడం స్వేచ్ఛ!

దుర్గామాతను సెక్స్ వర్కర్ అనడం స్వేచ్ఛ? 

వారి గురించి పార్లమెంటులో ప్రస్తావించడం మాత్రం స్వేచ్ఛ కాదు!

హిందూ మతంలోని దుష్టత్వాన్ని ప్రతిరోజూ దుమ్మెత్తిపోసే మన కమ్యూనిస్టులు – ఇప్పటికీ నేరస్థుల్ని నడివీధిలో రాళ్లతో కొట్టి చంపే ఇస్లాం గురించి ఒక్క మాటనరు.

విశ్లేషణ ఏకపక్షం కావడం మన దేశంలో కొందరి పద్ధతి. అలాంటి పద్ధతి అనుసరించిన రష్యాలో కమ్యూనిజం కుప్పకూలింది. కాపిటలిజానికి ప్రతినిధులైన దేశాలతో వ్యాపారం చేస్తూ, తన విధానాల్ని వారికి అనుకూలంగా సరళీకృతం చేస్తున్న చైనాలో నేడు నడుస్తున్నది పేరుకి మాత్రమే కమ్యూనిజం. ప్రపంచంలో మెజారిటీ ప్రజలు ఆమోదించని కమ్యూనిజం స్వేచ్ఛకి ఇచ్చే నిర్వచనాన్ని మన దేశంలో మెజారిటీ ప్రజలు ఎంతవరకూ ఆమోదించారో గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలే చెబుతున్నాయి.

మార్క్సిజమొక అద్భుత భావన. కుహనా మర్క్సిస్టులు దానికి మచ్చ తెస్తున్నారు. 

మన దేశంలో ఆస్తికత్వానికి మచ తెస్తున్నది ఆస్తికులే. అలాంటిదే కమ్యూనిస్టులకే వర్తిస్తుంది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే – ఈ క్రింది వ్యాసంలో ప్రయోజనాత్మకమైన అంశాలు చాలా ఉన్నాయి.

Exit mobile version