ఏప్రిల్ 18, 2018

కథల పోటీలు – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, Uncategorized at 6:52 సా. by వసుంధర

అమావాస్య..అర్థరాత్రి..అలికిడి

మనకు దేవుడిపై ఎంత భక్తి ఉంటుందో దెయ్యమంటే అంతకన్నా ఎక్కువ భయం ఉంటుంది. కానీ…ఎంత భయమున్న భయానక, సస్పెన్స్, థ్రిల్లర్ కథలు చదవాలంటే ఎంతో ఉత్సాహం కనబరుస్తాము.

నిజానికి ఒంటరిగా కూర్చోని అర్ధరాత్రి దెయ్యాల కథలు చదివితే ! ఆ థ్రిల్ అనుభవిస్తేనే తెలుస్తుంది. కావున రచయితలందరూ హార్రర్, సస్పెన్స్ ,దెయ్యాల కథలు రాసి పంపండి. పాఠకులకు అలాంటి అనుభూతిని కలిగించండి.

ఈ పోటిలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-

ప్రతిలిపి సాంకేతిక పట్టిక ఆధారంగా:

మొదటి బహుమతి :- 1000/-rs
రెండవ బహుమతి :- 500/-rs
న్యాయనిర్ణేత అదించే ఫలితాలు ఆధారంగా:-
మొదటి బహుమతి :- 1000/-rs
రెండవ బహుమతి :- 500/-rs
గెలుపొందిన నలుగురి విజేతలకు ప్రశంసా పత్రం సాఫ్ట్ కాపీ మెయిల్ లో పంపబడును.

నియమాలు :-

1.మీ రచనలు పంపడానికి చివరి తేది ఏప్రిల్ – 28 – 2018.
2.కథకి సంబంధిన ఫోటో కూడా మీరే పంపాలి. మీ కథలు తెలుగులో టైపు చేసి యూనికోడ్ ఫార్మాట్ లో telugu@pratilipi.com కి మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్టు లో “అమావాస్య ..అర్థరాత్రి..అలికిడి అని రాసి పంపాలి” అలా లేని వాటిని సాధారణ ప్రచురణలో ప్రచురిస్తాము గమనించగలరు.
3.మీరు పంపే కథలు కనీసం 500 పదాలకు మించి ఉండాలి. (500 వందల పదాల కన్నా తక్కువ ఉంటే పోటీకి స్వీకరిస్తాము కాని బహుమతి పొందుటలో మేము తీసుకునే ప్రమాణాలకి మీ రచన స్వీకరించలేము.)
4.పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ రచనలు పోటికి పంపరాదు, వేరే ఎక్కడైనా ప్రచురణ అయినవి స్వీకరించబడును.
5. మీరు పంపే రచనలలో అక్షర దోషాలు లేకుండా చూసుకోండి .

ఈ పోటీలో పాల్గొనే రచయితలకు సూచనలు:-
1. మీరు ఈ పోటీకి గాను పంపించే రచనలు యూనికోడ్ ఫార్మాట్‌లో telugu@pratilipi.com ఈ-మెయిల్‌కు మాత్రమే పంపించాలి.
2. ఈ పోటీకి రచనలు పంపించేటప్పుడు ఆ రచనకు సరిపడే ఛాయాచిత్రాన్ని కూడా జతపరిచి పంపగలరు. (కాపీ  రైట్స్ లేని ఛాయాచిత్రం కొరకుwww.pixabay.com వెబ్ సైట్ సందర్శించండి )
3.పోటీకి వచ్చిన రచనలు ఏప్రిల్ -30 -2018 వ తేది నుండి ప్రతిలిపి వెబ్ సైట్ లో పాఠకుల ముందు అందుబాటులో ఉంటాయి. అదే రోజు ఫలితాలు ప్రకటించే తేది తెలియజేయబడును.
4. విజేతల ఎంపిక రచనలకు వచ్చిన పాఠకుల సంఖ్య, రేటింగ్ మరియు రచనను చదవడానికి పాఠకులు కేటాయించిన సమయం వీటిని పరిగణంలోకి తీసుకోని మా సాంకేతిక వర్గం అందించే పట్టిక ఆధారంగా ఇద్దరినీ మరియు న్యాయనిర్ణేత ఇద్దరినీ సెలెక్ట్ చేస్తారు. మొత్తం నలుగురిని విజేతలను ప్రకటించబడును.

సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com మొబైల్ – 7259511956

Regards,

జాని తక్కెడశిల(రచయితల అనుసంధాన కర్త) 

www.pratilipi.com

వాట్స్ అప్ :-9491977190,మొబైల్ -7259511956

ప్రతిలిపి మొబైల్ యాప్ :  యాప్ కొరకు క్లిక్ చేయండి
స్వీయ ప్రచురణ నేర్చుకొనుట కొరకు వీడియో :వీడియో కొరకు క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: