ఏప్రిల్ 29, 2018

సినిమా నవలల పోటీ

Posted in కథల పోటీలు, Uncategorized at 12:58 సా. by వసుంధర

లంకె

సినిమా నవలల పోటీ – ఆరు లక్షల రూపాయల బహుమతులతో!

పోయిన నెల అంటే మార్చ్ 23 నుండి 25 వరకు జరిగిన రైటర్స్‌మీట్ 2018 లో HTO CLUB తరపున Veera Sanker గారు తెలుగు నవలల పోటి ప్రకటించి తెలుగు వారు కనీ వినీ ఎరగని ఆరు లక్షల రూపాయల బహుమతు లందుకోమని రచయితలని ఆహ్వానించారు.  ఇక్కడ వివరాలున్నవి.
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
హెచ్‌టిఓ క్లబ్ (హోమ్ థియేటర్ ఓనర్స్ క్లబ్) సగర్వంగా ప్రకటిస్తున్న సినిమా నవలల పోటీ
ఆరు లక్షల రూపాయల బహుమతులతో

మొదటి బహుమతి:  3,00,000/-
రెండవ బహుమతి:    2,00,000/-
మూడవ బహుమతి: 1,00,000/-

సాహిత్యం పునాదులనుండి ప్రభావవంతమైన సినిమా పుడుతుంది అని హెచ్‌టిఓ క్లబ్ నమ్ముతుంది. ప్రస్తుతకాలంలో దూరమైన ఈ రెండు ప్రక్రియల మధ్య ఒక వారధిగా నిలిచేందుకు హెచ్‌టిఓ క్లబ్ ముందుకొస్తోంది.

తెలుగు నవలల పోటీలలో నభూతో నభవిష్యతిగా ఆరు లక్షల రూపాయల బహుమతులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా “తెలుగు సినిమా నవలల” పోటీని ప్రకటిస్తోంది హెచ్‌టిఓ క్లబ్. కాకలు తీరిన రచయితలే కాదు, కొత్త రచయితలు కూడా ఈ పోటీని సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానం పలుకుతోంది హెచ్‌టిఓ క్లబ్. తెలుగు సినిమాకు తాజా కథలను, వైవిధ్యభరితమైన కథాంశాలను అందించే ఉద్దేశ్యంతో పాటు రచయితలకు సినీ అవకాశం కల్పించటం కూడా ఈ పోటీ ఉద్దేశ్యం.

నవలలు అందవలసిన ఆఖరు తేది: జూలై 31, 2018

ఫలితాల ప్రకటన: దసరా, అక్టోబర్ 19,2018

ఇద్దరు ప్రముఖ సినీ రచయితలు, ముగ్గురు ప్రముఖ సినీ దర్శకులు, ఇద్దరు ప్రముఖ సినీ విశ్లేషకులు, ముగ్గురు తెలుగు సాహితీవేత్తలు ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.

సినీ రంగానికి ఉన్నత ప్రమాణాలు కలిగిన కథలు అందించాలనే హెచ్‌టిఓ క్లబ్ సంకల్పానికి స్పందించి ఈ పోటీలో పాల్గొనవలసిందిగా తెలుగు రచయితలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.

వీరశంకర్,
డైరెక్టర్ (యూసి థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్)
హెచ్‌టివో క్లబ్

నవలలు పంపవలసిన చిరునామా :

Unique Concept Theaters PVT. LTD.
Plot No 11, Navodya Colony
Elareddy guda, Hyderabad – 500073
Mob: 9700179139

www.htoclub.com

Leave a Reply

%d bloggers like this: