తెలుగు కథల్లో, ఆంగ్లపదాల వాడకం ఎప్పటినుంచో ఉంది. అయితే అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంటోంది, ఏ ధోరణిలో ఉంటోంది అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నంలోంచి పుట్టుకొచ్చిందే ఈ వ్యాసం.
కథలో భాగాలు మూడు. కథ పేరు, పాత్రల వెనుక జరుగుతున్న కథ, పాత్రల మధ్య సంభాషణ.
కథల పేర్లు:
ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కథాసాహితి వారు 1990 నుంచి 2015 వరకూ ప్రచురించిన కథల సంపుటాల్లోని 351 కథల పేర్లు, అంతర్జాల పత్రికల్లో ప్రారంభ సంచిక నుంచి 2017 వరకూ వచ్చిన సారంగ 187 కథలు, ఈమాట 532 కథలు; మొత్తం కలిపి 1070 కథల పేర్లని పరిశీలించాను. వీటిలో పూర్తిగా ఆంగ్లపదాలతో పేరు ఉన్న కథలు 94. ఆంగ్లపదాలు, తెలుగు పదాలు కలగలిపి పేరు పెట్టబడిన కథలు 61. మొత్తం 155. 1070 కథల్లో వీటి శాతం 14.48. ఈ పేర్లని మూడు రకాలుగా రాయటం జరుగుతోంది.
మొదటిది-శీర్షికకి పూర్తిగా ఆంగ్లపదాలు వాడటం. ఇందులో రెండు పద్ధతులు. ఒకటి-ఆంగ్లలిపి వాడటం. ఉదాహరణ-The Professional. రెండు-తెలుగు లిపి ఉపయోగించటం. ఉదాహరణ-డీ హ్యూమనైజేషన్. మూడు-కథ పేరును ఆంగ్ల, తెలుగు లిపి-ఈ రెండిట్లోనూ రాయటం. రాఫెల్(Raffle), ఫ్యూగ్(Fugue).
రెండోది-ఆంగ్లపదాలు, తెలుగు పదాలు కలిపి వాడటం. దీనిలో రెండు ధోరణులు. ఒకటి-ఏ భాషకు చెందిన పదాలను, ఆ భాషలోనే రాయటం. నిదర్శనం-http://www/యంత్రరాక్షసి.com. రెండు-ఉభయ భాషాపదాలకు తెలుగు లిపి ఉపయోగించటం. దృష్టాంతం-మిథ్య ఎగ్జిబిషన్.
మూడోది-ఒక ఆంగ్లపదాన్ని, మరో తెలుగుపదంతో సంధించి కొత్తపదప్రయోగం చేయటం. ఉదాహరణ-Breakrooమోపాఖ్యానము: డబ్బింగ్ ఢమాల్, గూగోళ జ్ఞానం.
పై వాటికి తోడుగా ఒక కథకు, తెలుగు పదాలతో ఒక పేరూ-ఆంగ్లపదాలతో ఒక పేరూ పెట్టిన అరుదయిన సందర్భం ఒకటి కనపడింది. కథ పేరు-రాదె చెలీ! నమ్మరాదే చెలీ!(అనబడు) త్రిబుల్ స్టాండర్డ్స్.
కథ పేరుకి పూర్తిగా తెలుగు పదాలని వాడి, వాటిని ఆంగ్లలిపిలో రాసిన సందర్భాలు, నాకు తటస్థించలేదు…….
మొత్తం వ్యాసం ఈ లంకెలో చదవండి….
Leave a Reply