జూన్ 11, 2018
అమెరికాలో తెలుగు ‘పాఠశాల’
ప్రియమైన సభ్యుల్లారా…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మొదటి నుంచి తెలుగు అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తుంది. తానాలో ఉన్న తెలుగు కుటుంబాల్లోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పించి మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలని అనుకుంటోంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ భాగస్వామ్యంతో తెలుగు ఎన్నారై పిల్లలకు తగ్గట్టుగా తెలుగు భాషను బోధిస్తున్న ‘పాఠశాల’తో కలిసి తానా కుటుంబ చిన్నారులకు తెలుగు భాషను నేర్పించాలని అనుకుంటోంది.
కొత్త పద్ధతితో సులభంగా తెలుగును నేర్పిస్తున్న ‘పాఠశాల’
కొన్ని తరాలుగా పిల్లలకి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని పదాలతో ‘ఆ నుంచి’ వరకు తెలుగు అక్షరాలు నేర్పించి, తరువాత గుణింతాలు …. అలా తెలుగు నేర్పిస్తున్నాం. ఇది అందరికి తెలిసిన విషయమే! అయితే ఈ పద్దతి మారి పిల్లలకు ఇంకా సులభం గా భాష నేర్పే పద్దతి వచ్చిందంటున్నారు ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు. తల్లి భాష నేర్చుకోవడం ఓ స్కిల్ అని, అది సైన్స్ , సోషల్ లాగ ఓ సబ్జెక్టు కాదని వారి సిద్ధాంతం. అందుకే భాషని ఓ పిల్లవాడు తల్లి భాష ఎలా నేర్చుకొంటాడో ఆ విధం గా నేర్పాలని వారు చెప్పుతున్నారు.
పాఠశాల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖవారు పూర్తిస్థాయిలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా Listening, Speaking, Reading, Writing (ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యు) పద్ధతిలో తెలుగు పలుకు కోర్స్‌ను రూపొందించారు.
LSRW Method ద్వారా మొదటగా పిల్లలకు భాషను వినిపిస్తారు. అంటే టీచర్ తెలుగులో కథలు చెబుతూ ఉంటే విద్యార్థులు వింటుంటారు. తరువాత పిల్లల చేత సరళపదాలను మాట్లాడిస్తారు. పుస్తకంలోని పదాలను గుర్తుపట్టి చదవేలా చేస్తారు. చివరన అక్షరాలను, గుణింతాలను రాయిస్తారు.
తెలుగు పలుకు 4 సంవత్సరాల కోర్సులో తెలుగు పలుకు, తెలుగు అడుగు, తెలుగు పరుగు, తెలుగు వెలుగు ఉంటాయి. 4వ సంవత్సరం చివరిలో జరిపే పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎపి ప్రభుత్వ సర్టిఫికెట్లను కూడా అందించడం జరుగుతోంది.
పాఠశాల బోధనను తెలుసుకోవాలన్న వారి కోసం ఆన్లైన్లో ఇచ్చిన 30 రోజుల ఉచిత శిక్షణ లింక్‌ను క్లిక్ చేయండి. www.paatasala.net/en/free-trail-reg.php
తానా సభ్యులు, అభిమానులు తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పించేందుకు ‘పాఠశాల’లో పిల్లలను చేర్పించండి. ఒకవేళ మీకు పాఠశాలకు పంపే పిల్లలు లేకపోయినా, మీ స్నేహితులకు పాఠశాల సమాచారాన్ని ఇచ్చి వారి పిల్లలనైనా చేర్పించేందుకు కృషి చేయండి. తల్లి భాషను మన పిల్లలకు నేర్పించడం మన బాధ్యత. ఇందులో అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను.
ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర భాగస్వామ్యంతో, 4 సంవత్సరాల బోధనకు కావాల్సిన పుస్తకాలతో పాఠశాల అమెరికా లోని అన్ని పట్టణాల లో ప్రారంభం కావటానికి సిద్ధంగా ఉంది. అందరికీ ఉపయోగపడే పాఠశాలలో పని చేయాలనుకున్నవారు, తెలుగు భాషను పెంపొందించే ఈ కార్యక్రమం లో పాలు పంచుకోవాలనుకొనే తానా సభ్యులు తమ ఊరి పేరు .. ఇతర వివరాలతో నాకు పర్సనల్ గా (president@tana.org) మెసేజ్ పెట్టండి. అంటే కాదు.. డల్లాస్, అట్లాంటా, హ్యూస్టన్, చికాగో, డిట్రాయిట్, బోస్టన్, ఇండియానాపోలిస్ లాంటి ముఖ్యమైన నగరాలలో పాఠశాల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించాలనుకొనే తానా సభ్యులు కూడా వెంటనే నన్ను సంప్రదించాలని కోరుతున్నాను.
Satish Vemana, President | TANA | 703-731-8367
Leave a Reply