జూలై 2, 2018
ఆహ్వానం-
సాహితీ పల్లవం వాట్సాప్ గ్రూప్ సౌజన్యంతో
*ఆహ్వానం*
డా. చింతోజు బ్రహ్మయ్య స్మారక పీపుల్స్ హాస్పిటల్ మరియు బాలల ఉత్సవ కమిటీ ముస్తాబాద్
*బాలప్రతిభా పురస్కారాలు*_
విద్యార్థుల లో భాషా, సాహిత్యం పట్ల అభిరుచి ఆసక్తి కలిగించడానికి గాను వారి లోని సృజనాత్మకతను వెలికి తీసి తగు ప్రోత్సాహాన్నివ్వడానికి ముస్తాబాద్ బాలోత్సవ కమిటీ నిర్ణయించింది
ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల లోని బడి పిల్లల సృజనాత్మక రచనలకు, 2010 నుండి 2016 వరకు వచ్చిన సంకలనాలలో 20 సంకలనాలకు తేదీ 13.06.2018 రోజున గౌరవ మంత్రివర్యులు తారకరామారావు గారి చేతుల మీదుగా నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేయబడినాయి. అలాగే 2017 సంవత్సరంలో బడి పిల్లలు రాసిన వివిధ సాహిత్య ప్రక్రియల సంకలనాలను పురస్కార నిమిత్తం ఆహ్వానిస్తున్నాము.
రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అర్హులే కావున అయిదు ప్రతులు దిగువ తెలిపిన చిరునామాకు పంపించగలరు.
చివరి తేదీ ఆగష్టు15, 2018
ఇట్లు
డాక్టర్ చింతోజు శంకర్
డాక్టర్ రాజారామ్
చింతోజు నారాయణ
సంకలనాలు పంపవలసిన చిరునామా
గరిపల్లి అశోక్, ఫ్లాట్ నం. 404
VLR Residency, Biside Siddhartha School
Sreenivasa Nagar, Siddipet 502103
Mobile No. 984964910
Leave a Reply