ఆగస్ట్ 16, 2018
కవితలకు ఆహ్వానం
వాట్సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో
కాళేశ్వరం ప్రాజెక్టు పై కవితా సంకలనం కొరకు కవితలకు ఆహ్వానం…
ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు.
రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూపశిల్పులకు కవుల అక్షరనీరాజనం…
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం మరియు జయశంకర్ సారస్వత సమితి సంయుక్తంగా.. కాళోజి జయంతిన జరుపుకునే తెలంగాణా భాషా దినోత్సవం పురస్కరించుకోని… సెప్టెంబరు తొమ్మిది (09-09-2018) న కాళేశ్వరం ఆలయ ప్రాంగణంలో ఇంజీర్లకు అక్షరనీరాజనం అందించడంతో పాటు కవి సమ్మేళనం మరియు సంకలన ఆవిష్కరణ చేయడం జరుగుతుంది.
కావున ఇట్టి మహత్కార్యంలో మీరు పాల్గొని మీకవితలను అందించి ఆధునిక దేవాలయ రూపశిల్పులకు అక్షర నీరాజనం అందించండి.
మీ కవితలను ఈ నెల ఇరువై అయిదవ తేదీ (25-08-2018) వరకు పంపవలసి ఉంటుంది.
మీరు పంపే కవనం పద్య గద్య గేయ, వచనము ఇలా ఏ రూపంలో అయినా పంపవచ్చు. కాకపోతే పదహారు లైన్లకు మించి యుండరాదు.
మీ పరిచయం నాలుగు లైన్లకు మించి ఉండరాదు.
అక్షరదోషాలు ఉండకుండా భావయుక్తమైన కవితలను మాత్రమే స్వీకరించబడుతుంది.
మీ కవితల ఎంపిక విషయంలో సంకలనకర్తలదే తుది నిర్ణయం.
మరెందుకు ఆలస్యం… వెంటనే మీ కవితలను పంపించండి..
మరిన్ని వివరాలకు సంప్రదించండి
సంకలన కర్తలు:-
గోగులపాటి కృష్ణమోహన్
అధ్యక్షులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం
9700007653
మరియు
గడ్డం లక్ష్మయ్య
జయశంకర్ సారస్వత సమితి
9848693280
మీకు ఆసక్తి ఉంటే వెంటనే ఈ క్రింది లింకు ద్వారా గ్రూపులో చేరవచ్చు…
అంశానికి సంబంధించిన కవితలు తప్ప మరేవిధమైన పోస్టులు పెట్టరాదని విజ్ఙప్తి.
ఈ పోస్టును మీకు తెలిసిన అన్ని సాహిత్య గ్రూపులకు చేరవేయగలరు.
Leave a Reply