ఆగస్ట్ 29, 2018

మలేషియాలో మన తెలుగు

Posted in సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం, Uncategorized at 10:56 ఉద. by వసుంధర

గూగుల్ గ్రూప్ తెలుగు మాట శ్రీ శ్రీనివాస్ సౌజన్యంతో

విశాఖ నుంచి మలాయా వరకు..

image‘మలేసియా దేశపు అత్యంత ప్రతిష్టాత్మక ‘ధాతుక్’ పుర స్కార గ్రహీత, మలే సియా తెలుగు సం ఘం అధ్యక్షుడు, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, డాక్టర్ అచ్చయ్య కుమార్ చెన్నై తెలుగు మహాసభలకి వచ్చినప్పుడు తీసుకున్న ఇంటర్వ్యూ ఇది. మలేసియాలో రెండువందల ఏళ్లుగా స్థిర పడిన తెలుగువారు అయిదు లక్షలకి పైబడి ఉన్నారు. మలేసియా వంటి చిన్నదేశంలో ఇది పెద్దసంఖ్య. అం దులోనూ ఉత్తరాంధ్ర వారే అత్యధికులు. తెలుగు ప్రాంతంలో పుట్టి పెరగకపోయినా జీవిస్తున్న ప్రాంతంలో తెలుగు ప్రభుత్వ భాష కాకపోయినా పూర్వీ కుల మాతృభాషపై మలేసియా తెలుగు వారికి ఉన్న ప్రేమ ఆసక్తికరంగా ఉంటుంది. కలిసినప్పుడల్లా వారి మాటల్లోని ఉత్తరాంధ్ర యాస వినసొంపై ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ముఖాముఖిలో కూడా వారి భాష ఒక్కోసారి వ్యాకరణ విరుద్ధంగానూ ఒకోసారి కొత్త పదబంధాలతోనూ చిత్రమైన సొగసుతో ఉంటుంది. అందుకే ఈ ఇంటర్వ్యూలోని భాషలో అక్కడక్కడా ఉన్న అచ్చుతప్పులను మాత్రం సరిచేసి, మిగతాది యథాతథంగా ఇస్తున్నాను. 

మలేసియా తెలుగు సంఘం స్థాపన నేపథ్యాన్ని చెప్పండి
మలేసియాలో దక్షిణ పేరాక్ ఒక సురక్షితమైన ప్రదేశం. తెలుగు వాళ్ళందరూ ఉమ్మడిగా గ్రామవాసు లుగా గ్రామానికి

image

గ్రామం అందుబాటులో ఉండే వారు. తెలుగుబడులు, గుడులు, భాష, ఆచార వ్యవ హారాలు మనుష్యుల తీరుతెన్నులు, రూపురేఖలు విడ దీయలేనివి. అట్టి ప్రదేశంలో నేటి మలేసియా తెలుగు సంఘం ఆనాటి మలాయా ఆంధ్రసంఘం. మొదట దక్షిణ పేరాక్ ఆంధ్ర సంఘం అంటూ పిలువబడే ఈ సంఘం అధికారపూర్వకంగా 1956లో స్థాపింపబడ్డా యి. ఒకరిద్దరు తప్ప సంఘ సభ్యులందరూ సామాన్యులే. సంఘం కార్మికవర్గానికి చెందినది అంటే కాదనేవారు ఎవరూ ఉండరు.

మొదటితరం భారతీయులు చాలామంది కార్మిక వర్గానికి చెందినవారు. ఆ రోజుల్లో వీళ్ళకు వృత్తి ప రంగా కొన్ని సంఘాలుండేవి. ఇవన్నీ కులమతాలకు అతీతం. వీటితో సామాన్యులకు అంతగా పరిచయం లేదు. విద్యావంతులు, తెలుగు భాషాభిమానులు – ఉపాధ్యాయులు, నిర్వాహక వర్గానికి చెందిన కొంత మంది కృషి దీనివెనుక ఉంది. జాతిపై భాషపై మమ కారం పెంచుకున్నవారి ప్రయాస వలన తెలుగు వాళ్ళ ఉనికిని చాటి చూపించేందుకు సంఘం తప్ప మరే మార్గాలు లేవన్నది ఉహించగలిగారు. అదే సమ యంలో మరికొందరు వారివారి వ్యక్తిత్వాన్ని నిలుపు కునేందుకు సంఘాలను స్థాపించడంలో నిమగ్నత చూపించేవారు. ఇది ఒక్క తెలుగుజాతికే కాదు ఇతర భారతీయులకు వర్తిస్తుంది. కారణాలు ఏమైనప్పటికి  మలయా తెలుగు సంఘం నేటి నాల్గవ తరానికి ఒక మార్గదర్శి.

మలేసియా తెలుగువారిలో ఏయే ప్రాంతాల వారు, ఎన్ని తరాల నుంచి అక్కడ స్థిరపడ్డారు?
మలేసియాలో తెలుగువాళ్ళు నాలుగు తరాలుగా నివసిస్తున్నారు. వీళ్ళందరూ విశాఖపట్నం జిల్లా వా సులు. వీళ్ళలో ఆనాడు మద్రాసు పాలక ప్రాంతీయు లలో ఉన్నవారు కూడా లేకపోలేదు. వీరందరు కుల మతాలకు అతీతంగా మలేసియాలో అడుగు పెట్టారు. వృత్తిపరంగా తెలుగు వారందరూ అనర్హులే కావచ్చు. చదువుసంధ్యలు కూడా అంతంత మాత్రంగానే ఉండే వి. వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉండేది. గుర్తింపబడ్డ పల్లె వాసులు ఒకరి పిదప మరొకరుగా జట్టుజట్లుగా కూలీ కై పాకులాడుతూ గుమిగూడేవారు. కాలానుగుణంగా ఏదో కొంత చేర్చుకుని స్వదేశానికి మరలేవారు. రెండ వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంచుమించు వీళ్లలో సగానికి పై స్వదేశానికి మరలినట్లు గణంకాలు చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వలసలు పోవుట ఆ నాటి జీవనోపాధి. వలసకు ముఖ్యకారణం ఐరోపా దేశస్తులు చేపట్టిన సామ్రాజ్య విస్తరింపు. వీరిలో మొద టి స్థానం ఆంగ్లేయులది. మలాయా రాజ్యాలతో 1896, 1909లో బ్రిటిష్‌వారు,  మలాయ్ పాలకులు కుదుర్చుకున్న ఒడంబడికకు పిదప బ్రిటిష్ వారి ఆధి పత్యం ఎన్నోరెట్లు పెరిగిందనవచ్చు. ముఖ్యంగా వారి ధ్యేయం ఆసియా, ఆగ్నేయ ఆసియా రాజ్యాలను బ్రిటిష్ ఏలుబడిలోకి తేవటమే, అదే సమయంలో ఐరోపా దేశాల మధ్యనున్న పారిశ్రామిక ఉద్యమాలకు కావలసిన ముడి పదార్థాలు ఒక్క ఆసియా ఖండంలో లభ్యం కావటం, ఆర్థిక పోటాపోటీల వల్ల ఐరోపా దే శాలు, ఆసియాదేశాలపై దృష్టిని చాలించక తప్ప లే దు. చారిత్రకంగా బ్రిటిష్ వారికున్న చొరవ ఇతర ఐరోపా దేశస్తులకు లేనందున వారి ఆక్రమింపులకు అడ్డంకులు లేకపోయాయి.

మలాయా ఉష్ణశీతల మండల ప్రదేశం కాబట్టి కాఫీ, కోకో, రబ్బరు వంటి పంటలకు ప్రాముఖ్యత వహించింది. ఖనిజ లవణాలు కూడా లభ్యమయ్యేవి. ఈ పరిశ్రమలలో స్వదేశీయులైన మలాయ్ వారి ఆద రణ లేకపోవడంతో ఈ పంటలను సాగుచేసేటందుకు భారతీయులను తరలించడం మొదలిడిరి. వీళ్ళదరిని సంధి కూలీలుగా ఉపయోగించేవారు. ఈ పరిస్థితులు మలాయా స్వాతంత్య్రం పొందేవరకు కొనసాగుతూ వస్తుండేవి.

భారతీయులు మలాయా రాజ్యాలకు వలసపోవ డం ప్రధానంగా ఇరవయ్యవ శతాబ్ది మొదటి మూడు దశాబ్దాలలో చోటుచేసుకుందనవచ్చు. వలసదారుల లో తమిళులకు పిదప తెలుగు వారిది రెండోస్థానం. చాలామంది తెలుగువారికి సంపదపై ఆకాంక్ష. ఆ సం పదతో మాతృదేశాలకు మరలుటయే. కాని ఈ ఆశ యాలకు స్వస్తి పలికింది, మలాయా స్వాతంత్య్రం తోనే. బ్రిటిష్ పాలనలో సురక్షితమైన జీవన శైలి. వల సల ఉమ్మడి, బంధుమిత్రుల అన్యోన్యత – అన్నిటికి మేలుగా, కులమతాల నిర్భయం సాగేవి. బర్మా, సు మత్రా రాజ్యాలు వలసలకు చోటిచ్చినప్పటికి మలా యా ద్పీపకల్పాన్ని చాలామంది తెలుగువాళ్ళు ఇష్ట పడేవారు. బ్రిటిష్ పాలనలో కూలి వాళ్ళందరకు ఇ ళ్ళూ వాకిళ్ళు, ఆరోగ్య రక్షణకు ఆసుపత్రులు ఉం డేవి. పిల్లలకు, ఆయా భాషల వాళ్ళకు కూడా బడులు నిర్మించేవారు. నిజానికి సామాజికంగా బ్రిటిష్ పాలన లో ప్రజల అక్షరాస్యత పెరిగిందనవచ్చు. కూలీలుగా ఉన్నవారు నివాసాలను స్థిరపరచుకోగలిగారు. పను లు సక్రమంగా జరుగుతుండేవి.

తెలుగువారి స్థిర నివాసం రెండవ ప్రపంచ యుద్ధానికి పిదప చోటు చేసుకుందనవచ్చు. నేడున్న తెలు గు సంతతి వారందరూ నాల్గోతరానికి చెందిన వారు. రెండూ మూడోతరాల వారికి నిలకడలేని జీవితం. ర బ్బరు, కొబ్బరి తోటల విభజన, పారిశ్రామిక విస్తరణ చోటుచేసుకోవటం వలన ప్రజలు మరో వలసల పా లైరి.  నగరాల విస్తరణ, ప్రజలకు కొత్తపల్లెలు, ప్రతి ఒక్కరికి సొంతఇల్లు, రాకపోకలకు సొంతబండ్లు, ఉన్న త విద్యకు తగిన విద్యాలయాలు – ఇవన్నీ పరోక్షం గా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతున్నాయనవచ్చు. తెలుగు అకాడమీ నిర్మాణం అందుకు నిదర్శనం.

ఇండియాలో తెలుగువారు మాట్లాడే తెలుగుకి, మలేసియా తెలుగుకి – భాషాపరమైన వైరుధ్యాలు, ప్రత్యేకతలు ఉన్నాయా?
భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణమే కాకుండా ఇతర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి మధ్య ఆచా రాలు ఒకటైనా భాషాపరంగా మాట్లాడే తీరు, ఉచ్చార ణలో, రాతలో తేడాలు కనిపిస్తున్నాయి. మలేసియా లో తెలుగు వాళ్లందరూ విశాఖపట్టణం జిల్లా సముద్ర తీరవాసులే. మాండలికాన్ని అనుసరిస్తున్నారు. ఉదా హరణ- రాగులు అనడానికి ఇక్కడున్న తెలుగువాళ్ళు చోళ్ళంటారు. నేడున్న నాల్గోతరం తెలుగు వారు మ లాయి, తమిళభాషల ప్రభావంవలన వాడుకలో తెలు గుపదాలకు తమిళపదాలను ఉపయోగిస్తున్నారు. నే ను అన్నపదానికి నాన్ అనటం జరుగుతుంది. కొన్ని పదాలు వ్యతిరేక అర్థాలనిస్తున్నాయి.

అనేక తరాలుగా అక్కడే స్థిరపడినా పూర్వీకుల మాతృ భాష పట్ల ఇంత మమకారం ఎలా సాధ్యపడింది?
ఇక్కడి తెలుగువాళ్ళకు తెలుగుభాషపై ఉన్న మమకారం ఈనాటిది కాదు. భాషాపరంగా మలేసి యా తెలుగువాళ్ళందరు బ్రిటిష్ పాలకులకు రుణ పడిన వారగుదురు. వారి ఉదారభావన వలన ఆనా టి కూలీల పిలగాళ్ళకు ప్రవేశ పెట్టిన తెలుగు బోధన నేడున్న నాల్గోతరం వారి వరకూ నిలిచింది. మొదటి తరం వారు చాలామంది అక్షరాస్యత లేనివారు. శాస్త్రీ యంగా వారికి భాషాసంపద ఉంది. రెండవతరం తెలుగువాళ్లు కొందరు ప్రాథమిక స్థాయిలో తెలుగు చదువను రాయను తెలిసినవారు. కాని ఇప్పుడున్న నాల్గవతరం వారికి ప్రాథమికస్థాయి విద్యలో మలేసి యా ప్రభుత్వం అమలు చేసిన విద్యాప్రణాళికలో తమిళ భాష వలే తెలుగు భాషకు ప్రధానత లేనం దున, మూడు, నాల్గోతరం వారికి తెలుగుభాష పర భాషగా రూపొందింది. అయినప్పటికి తల్లిదండ్రులు, సంఘనాయకుల ప్రయాస, తోటి తమిళులు, చైనీయులకున్న మాతృభాషానురాగం వల్ల తెలుగు విద్యార్థు లను ప్రోత్సహింపక తప్పలేదు. చాలామంది తెలుగు వాళ్ళు విద్వాంసులు. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నారు. వీళ్ళకు తెలుగు బోధన అందుబాటులో ఉంటే కనుమరుగున ఉన్న భాషని బతికించగలరు. తెలుగు భాషబోధన పాఠ శాల విద్యాప్రణాళికలో లేకపోయినా తెలుగువారందరూ అనుసరించే టం దుకు మార్గం ఉంటుందన్న ఉద్దే శంతో మలేసియా తెలుగుసంఘం పెద్దపెట్టున తెలుగు బోధనా తరగతులను దేశవ్వాప్తంగా జరుపుతూ వస్తుంది.
(సశేషం)

–  కె.ఎన్. మల్లీశ్వరి
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
(రేపు గిడుగు రామమూర్తి జయంతి –
తెలుగు భాషా దినోత్సవం)

Leave a Reply

%d bloggers like this: