వసుంధర అక్షరజాలం

కవితల పోటీలు

వాట్‍సాప్ బృందం సాహితీ పల్లవం సౌజన్యంతో

అవినీతి వ్యతిరేక కవితల పోటీలు 2018
దేశంలో శాంతి, అభివృద్ధి, సంరక్షణలకు అడ్డు పడుతున్న అన్ని రకాల అవినీతిని ఖండిస్తూ విమర్శిస్తూ చక్కగా సూచన లిస్తూ రాసే కవితల పోటీకి కవితలు పంపించవలసినదిగా కోరుతున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో గుంటూరు “అమరావతి సాహితీమిత్రులు” నిర్వహించే ఈ పోటీకి ఏ ప్రక్రియలో నైనా కవితలు పంపవచ్చు. ఒక కవి ఒక కవిత మాత్రమే పంపించాలి. ప్రథమ బహుమతిగా అయిదు వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా మూడు వేల రూపాయలు, తృతీయ బహుమతిగా రెండు వేల రూపాయలు, అయిదు వందల రూపాయల బహుమతులు ఆరు ఇవ్వబడతాయి. విషయంతో పాటు చక్కని వ్యక్తీకరణ శిల్పం కూడా ముఖ్యం. న్యాయ నిర్ణేతల నిర్ణయమే తుది నిర్ణయం. పద్యాలు, లఘు కవితలైతే ఆరు పంపవచ్చు. వచన కవితలు, గేయాలైతే 24 పాదాలు మించకుండా ఉండాలి. ఇందుకు అంగీకరించే కవులు పోస్ట్/కొరియర్ ద్వారా మాత్రమే తమ కవితలను “డా. రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణ నగర్ 5వ లైను తూర్పు, గోరంట్ల, గుంటూరు 522034” చిరునామాకు 2018, అక్టోబర్ 31లోగా పంపాలని కోరుతున్నాం. అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ 9న ఉదయం 10 గం.కు గుంటూరు బ్రాడీపేట 2/1 సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హాలులో జరిగే సభలో విజేతలకు బహుమతులు ఇవ్వబడతాయి. ఫోన్ 9247581825

Exit mobile version