సెప్టెంబర్ 1, 2018

కోల్కతాలో తెలుగు పత్రిక

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 4:10 సా. by వసుంధర

గూగుల్ గ్రూప్ తెలుగుమాట శ్రీ శ్రీనివాసు సౌజన్యంతో

ఒక కమ్యూనిటీ మనుగడలో భాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆంధ్రేతర ప్రాంతాల్లో తెలుగు కమ్యూనిటీ బలంగా వున్న ప్రాంతాల్లో బరంపురం తరువాత, భిలాయ్, రాయ్ పూర్, బెంగాల్లోని ఖర్గపూర్, కలకత్తా ముఖ్యమైనవి.

Sarva Mangala ఈ తెలుగు నేల మీద పుట్టలేదు. పెరగనూ లేదు. అయినా ఆమె ఇక్కడ పుట్టి పెరిగిన వారందరి కంటే ధారాళమైన తెలుగు మాట్లాడగలరు. ఎక్కడా చిన్న తడబాటు కానీ, తప్పు కానీ కనిపించదు ఆమె తెలుగులో. ఆమెకి భాష మీద ప్రేమ ప్రయోజన రహితం కాదు. తన సామాజిక చింతనని వ్యక్తం చేయటానికి ఆమె భాషని ప్రభావవంతంగా ఉపయోగించుకుంటారు. పశ్చిమ బెంగాల్ నుండి “జాగృతి సమీక్ష” అనే తెలుగు పత్రిక ప్రచురించటం, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా దాని కోసం నిరంతరం పనిచేయటం చిన్న విషయం కాదు. ఆమె సహచరుడు Kesava Rao Mది కూడా ఇదే కథ. ఇద్దరూ కలిసి తమ భుజాల మీదనే ఆ పత్రిక భారం మొత్తం మోస్తున్నారు.

https://www.facebook.com/photo.php?fbid=1550342601742695&set=a.154728771304092&type=3&theater

Leave a Reply

%d bloggers like this: