వసుంధర అక్షరజాలం

పిల్లల కథ విడియోలకు ఆహ్వానం

వాట్‍సాప్ బృందం సాహితీ పల్లవం సౌజన్యంతో

బడి పిల్లలు చెప్పిన కథల వీడియోలకు
ఆహ్వానం.
****
” పిల్లల లోకం బాల సాహిత్య వేదిక ” రానున్న బాలల దినోత్సవం సందర్భంగా ‘బడి పిల్లలు చెప్పిన కథల వీడియో’ లను ఆహ్వానిస్తున్నది.అలా పంపిన వాటిలో వేదిక ఎన్నిక చేసిన మూడు కథలకు(ముగ్గురు పిల్లలకు) వేయి రూపాయల చొప్పున బహుమతులను బాలల దినోత్సవం నాడు” పిల్లల లోకం” అందజేస్తుంది.ఆకథలను యూట్యూబ్ లో “పిల్లలు చెప్పిన కథలు” గా అప్ లోడ్ చేసి ప్రదర్మిస్తుంది.ఆ కథలను వీడియోగా చిత్రించి పంపిన ఆ ముగ్గురు ఉపాధ్యాయులకు,లేదా తల్లిదండ్రులకు అభినందనగా ఐదువందల చొప్పున బహుమతులు పిల్లల లోకం అందజేస్తుంది.
నిబంధనలు:ఒక విద్యార్థి ఒక్క కథను మాత్రమే పంపించాలి.కథ ఐదు నిమిషాల నిడివి దాటకూడదు.కెమెరాతో గానీ,సెల్ ఫోన్ తో గానీ చిత్రించవచ్చు.స్పష్టంగా వినిపించాలి,కనిపించాలి. నిలబడి,కూర్చుని చెప్పవచ్చు.తరగతిలో ,మైదానంలో,ఏ చెట్టు కిందో,అరుగు మీదో ,పూలచెట్టు ముందో,ఇంటిముందో ,గుడిసె ముందో,వెన్నెల్లో,సూర్యకాంతిలో…ఎక్కడైనా చెప్పవచ్చు.హావభావాలతో కథలు చెప్పాలి.మూడేళ్ళ పిల్లల నుంచి పదవ తరగతి పిల్లల వరకు పాల్గొన వచ్చు.కథలు తేదీ 14-10-2018 లోగా పంపాలి.వాట్సాప్ ద్వారా: 9177887749కు,మెయిల్ dr.v.r.sharma@gmail.com కు పంపాలి.
వి.ఆర్.శర్మ.,అధ్యక్షులు
పిల్లల లోకం బాలసాహిత్య వేదిక.

Exit mobile version