సెప్టెంబర్ 16, 2018
6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నవంబర్ 3-4, 2018 మెల్ బోర్న్, ఆస్ట్రేలియా
సాదర ఆహ్వానం మిత్రులారా,
ఇరవై ఏళ్ల క్రితం అమెరికాలో ప్రారంభించి పదేళ్ళ క్రితం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఇప్పటి దాకా నాలుగు దేశాలలో (తెలుగు నాట హైదరాబాద్, అమెరికాలో హ్యూస్టన్, ఇంగ్లండ్ లో లండన్, సింగపూర్) లలో దిగ్విజయంగా సాగిన తెలుగు సాహితీ సదస్సు ల ప్రస్థానంలో ఈ సారి ఆస్ట్రేలియాలో మెల్ బోర్న్ మహా నగరంలో నవంబర్ 3-4, 2018 తేదీలలో
జరుగుతున్న 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు తెలుగు భాషాభిమానులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
సదస్సు వివరాలు, మెల్ బోర్న్ వెళ్ళడానికి వీసా, ప్రయాణాల కోసం మేము ఎంపిక చేసిన ట్రావెల్ ఏజెంట్, స్థానిక వసతుల వివరాలు ఇందుతో జతపరిచాం. వీసా ఆహ్వానం, ఆస్ట్రేలియా దేశ నిబంధనలకి మమల్ని సంప్రదించ వచ్చును. సభలో ప్రసంగించే ఆసక్తి ఉన్న వారు, ప్రతినిధిగా పాల్గొనదల్చుకున్న వారు ఇందుతో పొందు పరచబడిన నమోదు పత్రం పూర్తి చేసి, నిబంధనల ప్రకారం ప్రసంగ వివరాలు మాకు సకాలంలో అందించమని కోరుతున్నాం.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్థన్), ఆస్ట్రేలియా తెలుగు సంఘం (మెల్ బోర్న్), లోక్ నాయక్ ఫౌండేషన్ (విశాఖపట్నం) వారు సంయుక్తంగా ఈ 6 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు.
For More Information, and expression of interest in participation, please contact
సదస్సు సంచాలకులు
శ్రీని కట్టా (President, Telugu Association of Australia, Melbourne)
Phone 61 413 398 940, E-mail: sahithisadassu@taai.net.au
వంగూరి చిట్టెన్ రాజు (Vanguri Foundation of America)
Phone: (1) 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
ప్రధాన సమన్వయ కర్త
రావు కొంచాడ (తెలుగు మల్లి వ్యవస్థాపకులు)
Phone: 61 422 116 542, E-mail: rao.konchada@gmail.com
భారత దేశ సమన్వయ కర్త
వంశీ రామరాజు Phone: (91) 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in
కార్య నిర్వాహక వర్గ సభ్యులు
శ్రీ గుళ్ళపల్లి, రమాకాంత్, షర్మిల చుక్క అజిత్
గౌరవ సలహాదారులు
“పద్మభూషణ్” డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (భారత దేశం), సారధి మోటమర్రి (ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సమాఖ్య, సిడ్నీ), శాయి రాచకొండ (హ్యూస్టన్),
Leave a Reply