సెప్టెంబర్ 19, 2018

బతుకమ్మ పాటలు, కవితలు సేకరణ

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 1:07 సా. by వసుంధర

*బతుకమ్మ పాటలు, కవితలు,వ్యాసాలు సేకరణ*
*************************
ప్రకృతే పరమాత్మ అని నమ్మి, పూలలోనే ఆ పరాశక్తిని నిలిపి కొలిచే అద్భుతమైన జానపద సాంస్కృతిక ప్రతీక మన బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వ పతాకగా,ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రదీపికగా నిలిచే ఈ బతుకమ్మ పండుగకి పాటలే ప్రాణం, జీవం. అటువంటి పాటలన్నింటిని సేకరించి, ముద్రించి ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉచితంగా పెట్టాలని సంకల్పించింది మా మంచిర్యాల జిల్లా రచయితల సంఘం. పరిశోధనలకు, పరిశోధకులకి మరింత సహయాకారిగా ఉండేలా దీనిని విస్తృత పరుస్తూ కవితలు,వ్యాసాలు కూడా చేర్చాలని ఔత్సాహికుల నుండి రచనలు ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీరు రాసిన,మీకు తెలిసిన కవితల్ని, వ్యాసాల్ని, పాటల్ని,పుస్తకాల్ని, ఆడియో,వీడియో రూపంలో ఉన్న వాటి వివరాల్ని మాకు మీ ఫోటో,బయోడేటా వివరాలతో *బొడ్డు మహేందర్, ఇంటి నం.2-26,ఆదర్శ నగర్, చెన్నూరు పోస్ట్& మండలం, మంచిర్యాల జిల్లా-504201,ఫోన్:99634273(వాట్సాప్) ఈమెయిల్ : boddumahender2@gmail. com* కు పంపండి. ఒక ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని చారిత్రకంగా పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగస్వాములు అవ్వండి.
*ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ, బతుకమ్మ పండుగపై మక్కువ, అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ క్రతువులో పాల్గొని సహకరిస్తారని ఆశిస్తున్నాం.*

-బొడ్డు మహేందర్
అధ్యక్షుడు
-మేకల రామస్వామి
ప్రధాన కార్యదర్శి
మంచిర్యాల జిల్లా రచయితల సంఘం

దయచేసి ఈ సమాచారాన్ని మీడియా ద్వారా మరికొంత మందికి చేరేలా ప్రచురించి మా సదాశయంలో భాగస్వామ్యం అవ్వాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.. దయచేసి షేర్ చేయండి.

Leave a Reply

%d bloggers like this: