అక్టోబర్ 5, 2018

ఆడియో కథ/కవితల పోటీ – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం, Uncategorized at 12:25 సా. by వసుంధర

కథలు చదవడంతో పోలిస్తే వినడంలో ఎక్కువ హాయినిస్తాయి. ఎందుకంటే కథ చదివేటప్పుడు మాములుగా చదువుతూ పోతాము.కథ వినేటప్పుడు కథలోని సందర్భాలకు అనుగుణంగా వాయిస్ మారుతుంది. అప్పుడు కథలోకి మరింత లీనమౌతాము. చాలా రోజుల నుండి ప్రతిలిపి పాఠకులు ఆడియో కథలు కోరుతున్నారు. ఈ పోటీలో కేవలం రచయితలే కాదు పాఠకులు కూడా పాల్గొనవచ్చు.

పాఠకులు ప్రతిలిపిలోని మీకు నచ్చిన కథ/కవిత ఎంపిక చేసుకొని మీ వాయిస్ లో రికార్డు చేసి మాకు మెయిల్ చేయాలి.అలాగే రచయితలు కూడా తమ కథలను రికార్డు చేసి పంపవచ్చు.కొత్త కథలు రాసి ప్రతిలిపిలో ప్రచురణ చేసి పంపవచ్చు లేదా మీ రచనలు ముందుగా ప్రతిలిపిలో ఉన్నవి, లేదా వేరే రచయితల రచనలు కూడా రికార్డు చేసి పంపవచ్చు.ఏ రచన అయినా ప్రతిలిపిలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి.

ఈ పోటిలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-

కథల విభాగం:

మొదటి బహుమతి :- 1000

రెండవ బహుమతి :- 500

కవితల విభాగం :

మొదటి బహుమతి :- 1000

రెండవ బహుమతి :- 500

ఈ పోటీలో పాల్గొనడానికి పద్ధతులు :

1.కవితలు విభాగంలో పాల్గొనే వారు కవిత కనీసం పదహైదు వాక్యాలు ఉండేలా చూసుకోగలరు.

2.కథలకి ఎలాంటి నిబంధనలు లేవు ఎంత పెద్ద కథలైతే అంత మంచిది.

3. పోటీలో పాల్గొనే పాఠకులు ప్రతిలిపిలో ఏ రచయిత రచన రికార్డు చేశారో ఆ రచన యొక్క లింక్ మరియు కథ పేరు, రచయిత పేరు కూడా మీ వాయిస్ రికార్డులో చెప్పవలసి ఉంటుంది.

4.రెండు విభాగాలలో అందరూ పాల్గొనవచ్చు మరియు ప్రతివిభాగానికి ఐదు రచనల వరకు పోటీకి పంపవచ్చు.

5.ప్రతిలిపిలోనున్న వేరే రచయితల రచనలను పాఠకులు రికార్డు చేసినప్పటికీ కాపీ హక్కులు రచయితకే ఉంటాయి. కథ ఎవరిదైన ఎవరైతే రికార్డు చేసి ఉంటారో వారికే బహుమతి ఉంటుంది.

నియమాలు :-

1.ఎలాంటి అసౌఖర్యం లేకుండా మీ వాయిస్ రికార్డు ఉండాలి.

2.మీ వాయిస్ రికార్డ్స్ telugu@pratilipi.com కి మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్టులో గ్రామ్ఫోన్ పోటీకి అని టైపు చేయడం మర్చిపోవద్దు.

3.మీ వాయిస్ రికార్డ్స్ పంపడానికి చివరితేది డిసెంబర్-16. వాయిస్ రికార్డ్స్ ప్రచురించే తేది మరియు ఫలితాల తేది డిసెంబర్ -20 వ తేదిన తెలియపరుస్తాము.

4.విజేతల ఎంపిక మా న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారు. ఎలాంటి వాదోపవాదాలకు తావులేదు. తుది నిర్ణయం ప్రతిలిపివారిదే.

సందేహాలకు :

మెయిల్ – telugu@pratilipi.com  మొబైల్ – 7259511956 వాట్స్ యాప్ : 9491977190

 

Regards,

జాని తక్కెడశిల(రచయితల అనుసంధాన కర్త) 

www.pratilipi.com

వాట్స్ అప్ :-9491977190,మొబైల్ -7259511956

ప్రతిలిపి మొబైల్ యాప్ :  యాప్ కొరకు క్లిక్ చేయండి
స్వీయ ప్రచురణ నేర్చుకొనుట కొరకు వీడియో :వీడియో కొరకు క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: