అక్టోబర్ 20, 2018

కవితల పోటీ – క్రియేటివ్ ప్లానెట్

Posted in కథల పోటీలు, Uncategorized at 8:46 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో

సాహితి మిత్రులకి నమస్కారాలు!

ప్రపంచం లో మనిషి కి మరో మనిషి తో పోటీ, అన్ని రంగాల్లో అన్ని విధాలుగా విజయం సాధించడానికి ప్రతి నిమిషం యత్నం చేస్తూనే ఉంటాడు. ఈ పరుగు లో ఒక్కోసారి గెలుస్తూ మరోసారి ఓడిపోతూ ముందుకు సాగుతాడు. జీవితం ఒక రేస్ అయితే గెలిచేవరకు పరిగెడుతూనే ఉండాలి. మన చుట్టూ జరిగే సంఘటనలు మన మీద ఎంతో ప్రభావితం చేస్తాయి. వాటిని వ్యక్తపరిచే తీరులో భిన్నత్వం ఉండొచ్చు కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే.. అది ఏ రకమైన కళ అయినా అయి ఉండొచ్చు. కవులు అయితే అక్షరీకరిస్తారు, చిత్రకారులు అయితే చిత్రం ద్వారా భావాన్ని వ్యక్త పరుస్తారు ఇలా బిన్నం గా వ్యక్తీకరించవచ్చు.

బిన్నం గా ఆలోచించేవారు అరుదుగా నే కనిపిస్తారు అలాగే ఏదైనా కార్యక్రమాన్ని బిన్నం గా అలోచించి చేసే సంస్థ కూడా బిన్నం గా నే ఉంటుంది . అదిగో అలాంటి ఒక సంస్థ అది కూడా సామాజిక మాధ్యమం అయినా వాట్స్ అప్ ద్వారా ఒక సంచలనం సృష్టించిన (CP, creative plannet) మరొక కొత్త కార్యక్రమం తో మీ ముందు కు రాబోతుంది అదే “జాతీయ స్థాయి కవితల పోటీ”.

వర్ధమాన కవులు, నిలదొక్కుకున్న కవులు, ప్రముఖులు, మహిళా కవయిత్రులు ఎవరైనా సరే మీరు ఈ పోటీకి పంపవచ్చు. వర్తమాన సంఘటనలకు స్పందించి అద్భుతంగా రాసే ప్రతి ఒక్కరు దీనికి అర్హులే. మరి ఇక ఆలస్యం ఎందుకు మీ కలాన్ని కదిలించండి . వెంటనే కవితలు రాసి పోటీకి పంపండి

పోటీ కి పంపించాల్సిన కవితల కి నియమ నిబంధనలు

ప్రతి కవిత 20 నుంచి 30 పంక్తుల లో పు మాత్రమే రాసి పంపాలి ..

PDF format లో కాకుండా Unicode లో మాత్రమే పంపాలి.

ప్రతి కవిత కి హామీ పత్రం తప్పనిసరి గా జత పర్చాలి..

కవిత తో పాటు రచయత అడ్రస్, ఫోన్ నెంబర్ తప్పనిసరి గా జత పర్చాలి .

మీ కవితలు ఎక్కడ ప్రచురించబడటం గాని, మరి ఎవరి అనుసరణ అయి ఉండకూడదు.

కాపీ కవితలు, ఫార్వర్డ్ కవితలు అంగీకరించబడవు.

మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని కవితలు రాసి పంపాలి, ఏ విధమైన వివాదం గాని, ఇతురల మనోభావాలను గాయపరిచేలా గాని ఉండకూడదు. అలాంటి కవితల్ని నిర్ద్వంద్వం గా తిరస్కరించబడును.

వచ్చిన కవితాల్లోనుంచి మూడు అత్యుత్తమ కవితల్ని ఎంపిక చేయడం జరుగుతుంది అలాగే మరో రెండు ప్రోత్సహక ఉత్తమ కవిత ని ఎంపిక చేయడం జరుగుతుంది

కవితల ఎంపిక లో తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే ..

అవార్డు గ్రహించలేకపోయినా కూడా జ్యూరీ మెంబెర్స్ మెచ్చిన కవితలని “శ్రీకారం:” పుస్తకం లో ప్రచురించడం జరుగుతుంది.

మీ కవితల్ని పంపవలసిన చివరి గడువు తేదీ : 30/10/2018

పోటీలో గెలుపొందిన విజేతలకు November 22, 2018 ముంబాయి లో బహుమతి ప్రధానం జరుగును.

మీ కవితల్ని పోటీకి పంపవలసిన చిరునామా
Natraajmaharshi@gmail.com

ప్రతి కవిత కి ముందుగా “జాతీయ కవితా పోటీ” లకు ఈ కవిత అని జత చేసి పంపాలి

ఇక మొదలు పెట్టండి మరి …శుభమస్తు.

Creative Planet

Leave a Reply

%d bloggers like this: