నవంబర్ 9, 2018

బాలల వనం

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 8:50 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

బాలల వనం విశిష్ట సేవా పురస్కారం – నివేదిక

(క్లుప్త పరిచయం)

~
బాలల వనం పిల్లలకోసం పనిచేసే ఒక సృజన వేదిక.
పిల్లలకోసం ఒక కళా ప్రపంచాన్ని నిర్మించడం మా లక్ష్యాల లో ఒకటి.అందుకోసం చాలా పనిచేశాం.చేస్తున్నాం.పిల్లల్ని కవిత్వం వైపు కథలవైపు నడిపిస్తున్నాం. బడిని అందమైన బొమ్మల కొలువును చేశాం.స్వతంత్య్ర ఆలోచనా పతంగలను చేశాం.ప్రతి సంవత్సరం బడిలో బాలల పండుగను జరిపాం.పిల్లలకోసం ఒక రాత పత్రికను నడుపుతున్నాం.పిల్లల కవిత్వం తో రెండు పుస్తకాలను తెచ్చాం..బాలల వనం, పిచ్చుక పాడిన పాట. నా పూర్వ విద్యార్థుల తో కలిసి సామాజిక సేవా కార్య్రమాలు నిర్వహించాం.ఇంకా ఇలాంటి పనులు చేస్తున్న ఉపాధ్యాయులు చాలా మంది వుంటారు.వారిని గౌరవించుకోవాలని వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాల నే ఆలోచన వచ్చింది. పోయిన సంవత్సరం నుంచి 5 రంగాలుగా విభజించు కొని పురస్కారాల ప్రదానం మొదలు పెట్టాము. గుర్తింపు కొరుకోకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోయే వాళ్ళు వుంటారు. అలాంటివారిని గుర్తించాల్సి ఉంది. అందుకని మేమే టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నాం.ఇందుకోసం ఎందరో సహకరిస్తున్నారు.నా ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, మిత్రులు,శ్రేయోభిలాషులు ఎందరో ఇందులో భాగస్వాములై వున్నారు.ముందుకు నడి పిస్తున్నారు.
ఇప్పటికి అనంతపురం జిల్లాకు పరిమితమయ్యాం.ముందు ముందు ఇతర ప్రాంతాల గురించి ఆలోచిస్తాం.
నమస్సులు…🙏🏻🙏🏻
~

– కొత్తపల్లి సురేశ్,
నిర్వాహకులు,
బాలలవనం.
9493832470

Leave a Reply

%d bloggers like this: